Home జాతీయ వార్తలు కొవిడ్ ప్రభావం ఆసియాన్ దేశాలు-భారత్ మధ్య స్నేహానికి సవాల్‌ 2022ను ఐక్యతా సంవత్సరంగా జరుపుకుందా… ప్రధాని...

కొవిడ్ ప్రభావం ఆసియాన్ దేశాలు-భారత్ మధ్య స్నేహానికి సవాల్‌ 2022ను ఐక్యతా సంవత్సరంగా జరుపుకుందా… ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

193
0

న్యూఢిల్లీ అక్టోబర్ 28
వచ్చే ఏడాదితో ఆసియాన్‌ దేశాల భాగస్వామ్యానికి 30 సంవత్సరాలవుతాయని, ఈ భాగస్వామ్యానికి గుర్తుగా 2022ను ఐక్యతా సంవత్సరంగా జరుపుకుందామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని గురువారం 18వ ఆసియాన్‌- ఇండియా సమ్మిట్‌లో వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం ఇంకా కరోనాతో పోరాడుతుందని, మహమ్మారి కాలంలో భారత్‌ కూడా అనేక సవాళ్లను ఎదుర్కొందని పేర్కొన్నారు. కొవిడ్ ప్రభావం ఆసియాన్ దేశాలు-భారత్ మధ్య స్నేహానికి సవాల్‌గా మారిందన్నారు. ఈ సమయంలో పరస్పర సహకారంతోనే బంధం బలోపేతం చేయగలమన్నారు. ఆసియాన్ దేశాలతో స్నేహమే భారత్కు ప్రధానం అని స్పష్టం చేశారు. 2022 నాటికి ఆసియన్‌ దేశాల భాగస్వామ్యానికి 30 సంవత్సరాలు, భారత్‌కు కూడా స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతాయన్నారు.
ఈ ముఖ్యమైన మైలురాయికి గుర్తుగా ‘ఆసియాన్‌ – భారత్‌ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుందామన్న మోదీ.. ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. 18వ ఆసియాన్‌- భారత్‌ సమ్మిట్‌ కరోనా మహమ్మారి, అంతర్జాతీయ అభివృద్ధి, వ్యాపారాలు, ఇతర సమస్యలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై సమీక్షిస్తుంది. ఆరోగ్యం, వాణిజ్యం, కనెక్టివిటీ, విద్య సంస్కృతి సహా కీలక రంగాల్లో సాధించిన పురోగతిపై చర్చించనున్నది.

Previous articleసోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం
Next articleనరేంద్ర మోదీ బలం తెల్సుకుంటేనే ఆయన్ని ఓడించగలరు బీజేపీ గెలిచినా, ఓడినా రాజకీయాలకు కేంద్రంగా ఉంటుంది రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here