జగిత్యాల నవంబర్ 25
నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్ధవంతంగా పని చేయాలని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ సూచించారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో డీఎస్పీ లు, సి.ఐ ల తో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారుల పని చేయాలన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ చూపించి వాటి సంఖ్యను తగించేలా కృషి చేసిన అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న క్రమంలో మంచి ఫలితాలు సాధిస్తున్నామని, ఇంకా పెండింగులో ఉన్న కేసులన్నింటిని పరిష్కరించేలా కృషి చేయాలని ఇందుకోసం కోర్టులలో న్యాయమూర్తులతో చర్చించి కేసుల పురోగతి, విచారణ విషయాలలో అధికారులంతా చురుకుగా పని చేయాలని సూచించారు. ఫంక్షన్ వర్టికల్ వారిగా విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి తరచుగా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. శిక్షణ తో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ఫంక్షనల్ వర్టికల్ వారిగా వారి యొక్క పర్ఫామెన్స్ ప్రతినెల తీసి ఉత్తమ సేవలు అందించిన వారిని గుర్తించి ప్రతి నెల కీ ఫర్ఫార్మెన్స్ రివార్డు ఇవ్వాలని సూచించారు.చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అయినా గుట్కా రవాణా, గంజాయి, పేకాట మరియు అక్రమ ఇసుక రవాణా వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి
జిల్లా నందు రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ఏవిధమైన చర్యలను తీసుకోవడం వలన ప్రమాదాలు తగ్గుతాయో అధికారులతో చర్చించారు.. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాలు వేగాన్ని నియంత్రించడానికి రోడ్ల పై భారీ కేడ్స్ ను పెట్టాలన్నారు.
ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించాలి
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆ యొక్క లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేయాలని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాల పై నిఘా ఉంచాలని వారి పై కేస్ లు నమోదు చేయాలని అన్నారు. వాహన తనిఖీలు నిర్వహించిన ప్పుడు ఏ వాహనం పైన మూడు చాలన్స్ పెండింగ్ లో ఉన్నట్లయితే సదరు వాహనాన్ని సీజ్ చేయాలన్నారు.
రౌడీ షీటర్స్,హిస్టరీ షీటర్స్ లపై నిరంతర పర్యవేక్షణ
పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని అన్నారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై కొత్తగా రౌడీషీట్స్ తెరవాలని ఆదేశించారు. అర్ధరాత్రి రోడ్లపై అనవసరంగా తిరుగుతూ, అసాంఘిక చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న యువతే లక్ష్యంగా ముమ్మర తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీ రూపేష్ , డీఎస్పీ లు ప్రకాష్, రవీందర్ రెడ్డి, డి సి ఆర్ బి డీఎస్పీ రాఘవేంద్రరావు,ఎస్ బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ దుర్గ సి.ఐ లు, ఎస్. ఐ లు పాల్గొన్నారు.