Home ఆంధ్రప్రదేశ్ సీడబ్ల్యూసీ గోడంగు రిలయన్స్ సంస్థ లీజుకు ఇచ్చారు మరి మాసంగతి ఏమిటి ...

సీడబ్ల్యూసీ గోడంగు రిలయన్స్ సంస్థ లీజుకు ఇచ్చారు మరి మాసంగతి ఏమిటి హమాలీల ఆవేదన

324
0

నంద్యాల
నంద్యాల పట్టణంలో బుధవారం నాడు
సీడబ్ల్యూసీలో పనిచేసే 112 మంది కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందన్నారు . రిలే నిరాహార దీక్షలను సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు  ప్రారంభించారు. దీక్షలలో సురేష్  తరుపున పనిచేయుచున్న 30 మంది హమాలీ కార్మికులు బుధవారం నాడు కూర్చున్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్ష ,కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమ్మద్ గౌస్,యూనియన్ నాయకులు    రామకృష్ణ,శివలింగం,వెంకటరమణ,పరమేష్ ,మద్దిలేటిలతో పాటు 100 కార్మికులు పాల్గోన్నారు.
ఈ దీక్షలను ఉద్దేశించి సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్,కె.మహమ్మద్ గౌస్ లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చడంలో వేగవంతంగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటు సంస్థల అభివృద్ధికి సహకారం అందిస్తున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు , దానిలో భాగంగానే సీడబ్ల్యూసీలో గత 30 సంవత్సరాల నుంచి నిల్వ ఉంచుతున్న బియ్యంను, గత 7నెలల నుండి ప్రైవేట్ గొడౌన్ లకు తరలింపు చేస్తున్నారని తెలిపారు , దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 15 కిలోమీటర్ల రవాణా చార్జీలు అదనపు భారం అవుతున్న అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై లాభాలను అర్జిస్తూ, ప్రైవేటు గోడౌన్లలో బియ్యం నిల్వ ఉంచేలా చూసేందుకు   జిల్లా సివిల్ సప్లయ్ అధికారులకు లక్షలలో డబ్బును ముట్టజెపుతున్నారని విమర్శించారు , దీనివల్ల హమాలీలకు పనులు లేకుండా చేస్తున్నారని తెలిపారు , ఇప్పటికే రాష్ట్ర సివిల్ సప్లై మేనేజింగ్ డైరెక్టర్ వీరపాండ్యన్ ఐఏఎస్ , కర్నూలు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు , ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి , నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్  గారి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని అన్నారు. ఈ దీక్షలు ఇక్కడ నాలుగు రోజుల పాటు కొనసాగి అనంతరం జిల్లాలో ఉన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటి వరకు నంద్యాల నుండి 11, 12 తేదీలలో పాదయాత్ర చేపట్టి అనంతరం ఆర్థికమంత్రి ఇంటిని ముట్టడిస్తామని అని అన్నారు. అదేవిధంగా నంద్యాల సిడబ్ల్యుసిలో ఉన్న రెండు గొడౌన్ లను రిలయన్స్ సంస్థ లీజుకు తీసుకున్నదని, 2గోడౌన్ లలో  ఎగుమతి, దిగుమతి జరిగే వాటిని హమాలీలకు పని ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Previous articleబద్వేల్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మ గురువారం నామినేషన్
Next articleశ్రీశైల దేవస్థానం లో 7వ తేదీ నుండి దసరా మహోత్సవాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here