Home జాతీయ వార్తలు వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ రవాణా శాఖ కీలక నిర్ణయం

వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ రవాణా శాఖ కీలక నిర్ణయం

104
0

న్యూఢిల్లీ నవంబర్ 1 (
దేశ రాజధానిలో కాలుష్యం పెరుగుతున్నది. ఈ క్రమంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. డ్రైవింగ్‌ సమయంలో వాహనానికి సంబంధించిన పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ (పి యు సి) సర్టిఫికెట్‌ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలంటూ పబ్లిక్‌ నోటీస్‌ జారీ చేసింది. సర్టిఫికెట్‌ సమర్పించడంలో విఫలమైతే ఆరు నెలల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా.. రెండూ విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. పీయూసీ సర్టిఫికెట్‌ చూపించని వాహనాల డ్రైవర్ల లైసెన్స్‌ను మూడు నెలల పాటు రద్దు చేస్తామని నోటీస్‌లో పేర్కొన్నది. సెంట్రల్‌ మోటార్‌ వెహికల్‌ రూల్స్‌ 1989 ప్రకారం.. ప్రతి వాహనానికి (BS-I/BS-II/BS-III/BS-IV అలాగే CNG/LPGతో నడిచే వాహనాలతో సహా) చెల్లుబాటు అయ్యే సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలని స్పష్టం చేసింది.

Previous articleఅకాల వర్షానికి భారీగా వరి పంటల నష్టం ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్దాం రాష్ట్ర రైతు సంగం కార్యదర్శి అడివప్ప గౌడ్
Next articleఆర్డీవో కార్యాలయంలో అమరజీవి కి ” ఘన నివాళి”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here