జగిత్యాల, సెప్టెంబర్, 29
హరితహారం, ప్రగతిపనులను నిర్దేశించిన లక్ష్యంమేర సకాలంలో పూర్తిచేసి జిల్లా అధికారులు అభివృద్దిలో జిల్లాను ఆదర్శంగా నిలపాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. బుదవారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాలులో యంపిడిఓలు, ఎపియంలతో గ్రామపంచాయితీలలో నర్సరీ మరియు ప్లాంటేషన్ పెంపకం మరియు నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, హరితహారం కార్యక్రమం ద్వారా నిర్థేశించిన లక్ష్యాన్ని కొన్ని మండలాలు సాధించినప్పటికి మరికొన్ని మండలాలు వెనకబడి పోయాయని అన్నారు. శతశాతం సర్వైవల్ ప్లానిటేషన్ వారంలోగా పూర్తికావాలని, జిల్లా వ్యాప్తంగా డిఆర్డీఏ 2020-21 ఆర్థిక సంవత్సరానికి 26 లక్షల 50వేల లక్ష్యానికి 25 లక్షల 45వేల లక్ష్యాన్ని మాత్రమే సాధించారని, 1లక్షా 5వేల లక్ష్యాన్ని పూర్తిచేయవలసి ఉన్నదని సూచించారు. ప్లానిటింగ్, పిటింగ్ కొరకు యంపిడిఓలు ఇచ్చిన యాక్షన్ ప్లాన్ ప్రకారం, 4వారాలలో పనులు పూర్తికావాలని సూచించారు. అన్నిచోట్ల 100% వాచ్ ఆండ్ వార్డ్ లను ఏర్పాటు చేయడంతో పాటు వారికి సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వైకుఠదామాలు, కాంపోస్ట్ షెడ్ మొదలగు వాటిలో పనిజరిగిన మేరకు చెల్లింపులు జరగాలని, ప్రకృతివనాలలో మొక్కలు నాటడానికి స్థలాన్ని వృదా చేయకూడదని, బయోఫెన్సింగ్ ను ఏర్పాటు చేయాలని, ప్రగతి పనులను యంపిడిఓలు క్షేత్రస్థాయిలో స్వయంగా వెళ్లి తనిఖీలు చేయాలని, డ్రయింగ్ ప్లాట్ ఫాం, మ్యాజిక్ సోక్ పిట్ పనులపై దృష్టిసారించి అనుమతుల పొందిన మేరకు పనులను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన అనుమతుల మంజూరు పొందాలని అన్నారు. జిల్లాలో జనాబా, ప్రాంతం వారిగా అర్హులైన వారిని గుర్తించి గిరివికాస్ పథకం ద్వారా నీటి బావులు, విద్యూత్ సౌకర్యం కల్పించేలా అవకాశం కల్పించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ లబ్దిదారుల యూనిట్లను అక్టోబర్ 10 లోగా గ్రౌండిగ్ చేయాలని, 2017-18, 2018-19 ఎస్సీ యాక్షన్ ప్లాన్ పై ఖ సబ్సిడి మంజూరు చేయబడి గ్రౌండింగ్ కొరకు సిద్దంగా ఉన్న లబ్దిదారుల యూనిట్లను యంపిడిఓలు ఎప్పటికప్పుడు స్పందించాలని, లబ్దిదారులకు యూనిట్లను అందించడంలో చొరవ చూపించాలని, బ్యాంకు అధికారులు ఇబ్బందులు గురిచేయకుండా అవసరమైతే స్వయంగా వెళ్లి యూనిట్ల పంపిణి జరిపించాలని అన్నారు. మిల్చ్ఎనిమల్స్ కొరకు వచ్చిన ధరఖాస్తులపై బ్యాంకు సమ్మతిలో అక్జబర్ 10 లోగా కార్పోరొషన్ సమర్పించాలనిచ, చర్యలు తీసుకోవాలని, ట్రైకార్ 2020-21, 2021-22 యాక్షన్ ప్లాన్ క్రింద లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి బ్యాంకు సమ్మతితొ ప్రతిపాదనలను సమర్పించాలని ఎవైన ఇబ్బందులు తలెత్తినట్లయితే వాటి పరిష్కారం దిశగా కృషి చేయాలని అన్నారు. గ్రామాలలో పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లులును సిపిఓ ద్వారా సమీక్షించుకోవాలని, పనులకు సంబంధించి మంజూరు చేసిన పనులు, ప్రస్తుత ప్రగతి, ఇప్పటి వరకు ప్రారంభించని పనుల వారిగా నివేదికను తయారు చేసి పంపించాలని, వివిధ కారణాల చేత ఇప్పటి వరకు ప్రారంభించని పనులను కొనసాగించకుండా వాటిని రద్దు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ జె. అరుణశ్రీ, డిఆర్డీఓ పిడి ఎస్. వినోద్, అటవి శాఖ అధికారి బి. వెంకటేశ్వర్ రావు, జట్పీ సిఈఓ సంద్యారాణి, జిల్లా పంచాయితి అధికారి నరేష్, ఈడి ఎస్సీ కార్పోరేషన్ అధికారి లక్ష్మీనారాయణ, ముఖ్యప్రణాళిక అధికారి, యంపిడిఓలు, ఇతర అధికారులు పాల్గోన్నారు.