కోరుట్ల అక్టోబర్ 11
ఈ నెల 12న జరిగే రైతు మహా ధర్నా ను విజయవంతం చేయాలని వామపక్షాల పార్టీల నేతలు పిలుపు నిచ్చారు. సోమవారం
కోరుట్ల పట్టణంలోని ప్రభాకర్ భవన్ లో కామ్రేడ్ చెన్న విశ్వనాథం అధ్యక్షతన వామపక్షాల పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్షాల పార్టీల నేతలు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే వంద రోజుల లోపు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని ఇచ్చిన హామీని నిలుపు కోవాలని అలాగే రైతులు సాగు చేసిన వరి,మక్కలు ధాన్యం కొనుగోలు యధావిధిగా కేంద్రాలను కొనసాగించాలని ఈ నెల 12 న తలపెట్టిన రైతు ధర్నాను విజయవంతం చేయాలని రైతు సంఘాలు కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలు రైతులపై ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలాంటి చట్టాలను వెంటనే ఉపసంహరించు కోవాలని కోరారు. రైతులు పండించిన వరి మక్కలు దాన్యం గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని అని కోరారు .ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చెన్న విశ్వనాథం , ఏఐటియూ సి జిల్లా అధ్యక్షులు సుతారి రాములు, సిపిఎం నాయకులు తిరుపతి నాయక్, సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు చింత భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.