Home తెలంగాణ వివిధ శాఖల సమన్వయంతో కోవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యం సకాలంలో పూర్తిచేయాలి * జిల్లా...

వివిధ శాఖల సమన్వయంతో కోవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యం సకాలంలో పూర్తిచేయాలి * జిల్లా కలెక్టర్ జి. రవి

184
0

జగిత్యాల అక్టోబర్, 21
జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని సకాలంలో సాధించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు.  గురువారం జగిత్యాల మండలం దరూర్ గ్రామపంచాయితి పరిధిలో, మల్యాల మండలం గొల్లపెల్లి మరియు నూకపెల్లి లలో ఆకస్మీకంగా పర్యటించి కోవిడ్ వ్యాక్సినేషన్, సానిటేషన్ ప్రక్రియను పరిశీలించారు.  గ్రామంలో ఇంటి గోడలపై  వ్రాసిన ప్రకటన వ్రాతలను తొలగించి గ్రామాన్ని అందంగా, పరిశుభ్రంగా ఉంచాలని, గ్రామంలో ఎప్పటికప్పుడు సానిటేషన్ కార్యక్రమాలను నిర్వహించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని సూచించారు.
అనంతరం గ్రామంలో వాడవాడల్లో ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ గురించి గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. 18 సంవత్సరాల వయస్సు మొదలు కొని ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ పై ఎటువంటి అపోహాలు పెట్టుకోవద్దని, అనుమానాలు ఉంటే వైద్యాధికారుల ద్వారా వాటిని నివృత్తి చేసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని, కుటుంబలో 18 సంవత్సరాల వయస్సు మొదలుకొని ప్రతిఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవడం వలన, కోవిడ్ ప్రబావాన్ని సమర్దవంతంగా ఎదుర్కోగలుగుతామని పేర్కోన్నారు.
ప్రజల ఆరోగ్య రిత్య ప్రభుత్వం ప్రతిఒక్కరికి అందించే సంకల్పంతో గ్రామాలలో ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి పూర్తి ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందని తెలియజేశారు. మీ గ్రామంలో ఎప్పడు ఏక్కడ వ్యాక్సిన్ ఇస్తారు అనే సమాచారం కూడా ముందుగానే మీకు అందిస్తారని, వాటి ఆదారంగా గ్రామంలోని ప్రతిఓక్కరు  కోవిడ్ వ్యాక్సిన్ లను పొందాలని సూచించారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై వైద్యాధికారులతో పాటు ప్రత్యేకాధికారులు, మరియు ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇంటింటి సర్వే నిర్వహించి స్టిక్కర్లను అతింకించాలని, వ్యాక్సిన్ పై సరైన నివేధికలను తయారు చేయాలని, తెలికపాటి అనారోగ్య సమస్యలతో బాదపడే వారిని పరిశీలించి వారికి అవగాహనను కల్పించి వ్యాక్సిన్ అందించాలని ఆధికారులను ఆదేశించారు.ప్రతిరోజు సాయంత్రం వ్యాక్సినేషన్ ప్రక్రియపై అధికారులతో సమీక్షిస్తామని జిల్లా కలెక్టర్ పేర్కోన్నారు. కల్పించి గ్రామాలలో అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు కూడా బాగస్వాములై చేత్త చేదారంతో పాటు ఇంటి గోడలపై వ్రాసే రాతలను తొలగించి గ్రామాన్ని పరిశుభ్రంగా తయారు చేసుకొని వ్యాదిరహిత స్వచ్చ గ్రామాలను తీర్చిదిద్దాలని అన్నారు.
ఈ పర్యటనలో జిల్లా వైద్యాధికారి డా. పి. శ్రీధర్, ఉప వైద్యాధికారి డా. జైపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Previous articleబొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలి – సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన
Next articleజగన్ మోహన్ రెడ్డి కి చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలి నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here