జగిత్యాల, సెప్టెంబర్ 24
ఓ వృద్ధురాలు అజాగ్రత్తతో బంగారాన్ని పోగొట్టుకోగా అది దొరికిన ఓ యువకుడు పోలీసులకు సమాచారం అందించి సదరు వృద్ధురాలికి వారి సమక్షంలోనే బంగారాన్ని అందించడంతో ఆ యువకుడిని పోలీసులు అభినందించారు.జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెరకపల్లి గ్రామానికి చెందిన కందుల లింగవ్వ అనే వృద్ధురాలు తాను గతంలో కొనుగోలు చేసిన రు.30 వేలు విలువ చేసే అర తులం బంగారాన్ని తన బొడ్ల సంచి లో దాచుకుంది. గురువారం రాత్రి అదే గ్రామంలోని కిరాణా దుకాణం కి వెళ్ళిన లింగవ్వ సరుకులు తీసుకుని ఇంటికి వస్తున్న క్రమంలో బొడ్ల సంచి లో దాచుకున్న బంగారం ఎక్కడో పడిపోయింది. ఇది గమనించని లింగవ్వ యధావిధిగా ఇంటికి వెళ్ళింది. అయితే ఆ బంగారం ఉన్న పాకెట్ అదే గ్రామానికి చెందిన బాలే వనిత అనే మహిళకు దొరకడంతో విషయాన్ని తన భర్త బాలే తిరుపతికి తెలిపింది. చాలాసేపటి వరకు బంగారం గురించి ఎవరైనా వస్తారేమోననిఆరా తీసినప్పటికీ ఎవరు రాకపోవడంతో బంగారం దొరికిన విషయాన్ని బాలే తిరుపతి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే రాత్రి కావడంతో తెల్లవారి తమకు దొరికిన బంగారాన్ని తీసుకుని రూరల్ ఎస్ఐ చిరంజీవికి అందజేశాడు. బంగారం పోగొట్టుకున్న విషయం రాత్రి గమనించని వృద్ధురాలు లింగవ్వ ఉదయం తెలుసుకొని రోదించడం తో గమనించిన తిరుపతి కుటుంబ సభ్యులు బంగారం తమకే దొరికిందని తాము రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చి వచ్చామని తెలపడంతో వృద్ధురాలు లింగవ్వ తన కుమారుని తీసుకొని రూరల్ ఎస్సై చిరంజీవిని కలిసింది. బంగారానికి సంబంధించిన తగిన ఆధారాలు చూపించడంతో ఆ బంగారం వృద్ధురాలి దేనని నిర్ధారించిన ఎస్సై చిరంజీవి బాలే తిరుపతి ద్వారా ఆ వృద్ధురాలికి బంగారాన్ని అందజేశారు.తమకు దొరికిన బంగారాన్ని తిరిగి వృద్ధురాలికి అందజేసిన తిరుపతి కుటుంబ సభ్యుల ఔదర్యాన్ని జగిత్యాల రూరల్ ఎస్సై మంద చిరంజీవి అభినందించారు.
Home తెలంగాణ దొరికిన బంగారం వృద్ధురాలికి అప్పగింత యువకుడిని అభినందించిన జగిత్యాల రూరల్ ఎస్సై చిరంజీవి