జగిత్యాల అక్టోబర్ 30
విద్య వ్యవస్థ పటిష్ఠతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేశ్ అన్నారు.శనివారం జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ ఆధీనంలో పని చేస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత స్పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభించుటకు జిల్లా పరిషత్ ద్వారా ఆమోదించబడిన అండర్ టేకింగ్ సర్టిఫికెట్స్ సంబంధిత ప్రధానోపాధ్యాయులకు శనివారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన దావ వసంత సురేష్ చేతుల మీదుగా అంద చేశార.ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన కల్పించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ సుందరవరధారాజన్ ,ప్రధానోపాధ్యాయులు కె. నర్సింగ రావు, సత్యనారాయణ పాల్గొన్నారు.