Home తెలంగాణ పేదల ఆత్మగౌరవంతో జీవించాలనేదే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల...

పేదల ఆత్మగౌరవంతో జీవించాలనేదే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

359
0

జగిత్యాల అక్టోబర్ 14
పేదలు ఆత్మ గౌరవం తో డబుల్ బెడ్ ఇండ్లలో జీవించాలన్నది సీఎం  కేసిఆర్ లక్ష్యమని  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి  కొప్పుల ఈశ్వర్  తెలిపారు.జిల్లా లోని చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల మండలం నూకపల్లి గ్రామంలో నిర్మించిన 65 డబుల్ బెడ్ రూం ఇండ్లను  గురువారం స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్, జెడ్పి ఛైర్పెర్సన్ల తో కలిసి  లబ్దిదారులకు అందజేసారు. జీ+1 విధానంతో నిర్మీంచిన ఇండ్ల కేటాయింపు సభాప్రాంగణంలో చిన్న పిల్లల ద్వారా లాటరీ  పద్దతిన  జరిగింది.
అనంతరం  నిర్వహించిన  కార్యక్రమంలో  పాల్గోన్న మంత్రి మాట్లాడుతూ గూడు లేని నిరుపేదలకు సకల సౌకర్యాల తో కూడిన డబుల్ బెడ్ రూం ఇండ్ల లో ఆత్మ గౌరవంతో జీవించాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వప్నమని తెలిపారు.  డబుల్ బెడ్ రూం ఇండ్ల  పట్ల ప్రజలలో అధిక డిమాండ్ ఉన్నప్పటికి పలు కారణాల వల్ల నిర్మాణం ఆలస్యమవుతుందని  మంత్రి  తెలిపారు.   భూ సమస్య,  కాంట్రాక్టర్లు ముందుకు  రాకపోవడం, మౌలిక వసతుల కల్పన వంటి పలు సమస్యల  గుర్తించామని అన్నారు.  ప్రజలలో అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో  సీఎం కేసిఆర్ త్వరలో  నూతన  పథకం ప్రారంభిస్తారని,  స్థలం ఉన్న వారికి ఇండ్లు నిర్మించుకునేందుకు  రూ.5 లక్షల వరకు ఆర్థిక సహయం అందజేస్తారని తెలిపారు.
గత సంవత్సరం  బడ్జేట్ లో డబుల్ బెడ్ రూం  ఇండ్ల నిర్మాణానికి 11 వేల కోట్లను సీఎం కేటాయించారని,  కరోనా  కారణంగా  ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో   నూతన పథకం ప్రారంభించలేదని, ప్రస్తుతం  కరోనా నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో త్వరలోనే  నూతన  పథకం  సీఎం కేసిఆర్ ప్రారంభిస్తారని  మంత్రి  తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా  గ్రామీణ ప్రాంతాలో  అభివృద్ది కోసం  పటిష్ట చర్యలు చేపడుతున్నామని, ప్రతి  ఇంటికి త్రాగు నీరు సరఫరా చేసామని,  ప్రతి గ్రామంలో  నర్సరీ, డంపింగ్ యార్డు, ట్రాక్టర్, ట్యాంకర్, స్మశానవాటిక నిర్మించామని  తెలిపారు.  పచ్చదనం పెంపొందించే దిశగా  చేపట్టిన  తెలంగాణకు  హరితహారం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని,   రాష్టంలో పచ్చదనం  పెరిగిందని  అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద ప్రజలకు సీఎం కేసిఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని,  ఆసరా  పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముభారక్, కేసిఆర్ కిట్,   రైతుబంధు,  రైతు భీమా, పంట కోనుగొలు 24 గంటల ఉచిత విద్యుత్, డబుల్ బెడ్ రూం ఇండ్లు వంటి పథకాలను అమలు చేస్తున్న ఏకైక  రాష్ట్రం తేలంగాణ మాత్రమేనని మంత్రి పేర్కోన్నారు. దళితుల అభ్యున్నతి  కోసం  సీఎం కేసిఆర్  చారిత్రాత్మీక  దళిత బంధు పథకాన్ని  రూపకల్పన చేసారని, ప్రస్తుతం  హుజురాబాద్ నియోజకవర్గం మరియు మరో 4  మండలాలో   ఫైలెట్ ప్రాజేక్టు అమలు చేస్తున్నామని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో  దళిత బంధు అమలు చేస్తామని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో  పాల్గోన్న జడ్పీ చైర్ పర్సన్  దావవసంత మాట్లాడుతూ  పేదప్రజలు గౌరవంతో బ్రతికే విధంగా   మరే  రాష్టంలో లేనివిధంగా   రెండు పడక గధుల ఇండ్లను  సీఎం కేసిఆర్ నిర్మించి అందించారని  తెలిపారు.  100% ఉచితంగా  ఎలాంటి రుణభారం లేకుండా  పేదలకు ఇండ్లు నిర్మిస్తున్నామని అన్నారు.ఈ సందర్భంగా ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో  పాల్గోన్న జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ   నూతన ఇండ్లు పొందిన లబ్దిదారులకు   అభినందనలు తెలిపారు.   ప్రబుత్వం  రూ.4 కోట్ల 10 లక్షల వ్యయంతో 65 డబుల్ బెడ్ రూం ఇండ్లను  నూకపల్లి గ్రామంలో నిర్మించిందని,  వీటిని   నూకపల్లి గ్రామంలోని 33 మందికి,  రామనపేట గ్రామంలోని 15 మంది, పోతారం గ్రామంలోని 15 మంది లబ్దిదారులకు ఇండ్లను అందించామని  తెలిపారు.
రైతు సంక్షేమం దిశగా  రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుంటే , రైతు వ్యతిరేక విధానాలతో  కేంద్ర ప్రభుత్వం  పనిచేస్తుందని  చొప్పదండి ఎమ్మెల్యే   సుంక రవిశంకర్  తెలిపారు.   పేదవారి సోంతింటి కలను సాకారం చేసే దిశగా  సీఎం కేసిఆర్ పనిచేస్తున్నారని   తెలిపారు.
చొప్పదండి నియోజకవర్గ  పరిదిలో  చొప్పదండిలో 200, ఆర్నకొండలో మరో 200 ఇండ్లను ఫిబ్రవరి మాసం లోపు పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని , నియోజకవర్గానికి మంజూరైన ఇండ్లను త్వరగా  ప్రజలకు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.  చొప్పదండి నియోజకవర్గానికి 2 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను సీఎం కేసిఆర్ మంజూరు చేస్తామని  హమి ఇచ్చారని   ఎమ్మెల్యే  అన్నారు.   ప్రస్తుతం అందించే ఇండ్లకు  డ్రైయినేజీ, త్రాగునీటి సరఫరా,  రోడ్డు వంటి సమస్యలను పరిష్కరించి పూర్తి ఉచితంగా అందిస్తున్నామని  తెలిపారు.
గత ప్రభుత్వాలు కొంత బ్యాంకు రుణం, కొంత సొంత  ఖర్చు, కొంత సబ్సీడితో  ఇండ్లు అందించే వారని,  తెలంగాణ ప్రభుత్వం 100 శాతం ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి అందిస్తున్నామని తెలిపారు.    రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్ సమస్యను  పరిష్కరించి రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించారని  తెలిపారు.   కాళేశ్వరం ప్రాజేక్టు నిర్మాణంతో  వరదకాలువ జీవనదిగా మారిందని, 6 మండలాలో పుష్కలంగా రైతులకు నీరు అందుబాటులొ ఉందని  తెలిపారు.  రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలు  అమలు చేస్తున్న  ఏకైక  రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మేల్యే అన్నారు.  బీజేపి, కాంగ్రేస్  పరిపాలిత  రాష్ట్రాలో  ధాన్యం  కొనుగొలు జరగడం లేదని   తెలిపారు.
రైతు వ్యతిరేక  చట్టాలను  కేంద్ర ప్రభుత్వం  రుపొందించిందని,  దాని  పై పోరాడుతున్న రైతులను  హరియాణ సీఎం  బహిరంగంగా బెదిరించారని,  ఉత్తర్ ప్రదేశ్   రాష్ట్రంలో పైశాచికంగా   రైతుల  పై నుంచి వాహనాలు తరలించి  రైతుల ప్రాణాలు తీసారని ఎమ్మేల్యే విమర్శించారు.
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం  మోటార్లకు మీటర్లు పెట్టాలని చుస్తుందని,  మన పక్క  రాష్ట్రం  ఆంధ్రప్రదేశ్ లో మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేసారని,  తెలంగాణ  రాష్ట్రంలో ఎట్టి  పరిస్థితులో మోటార్లకు మీటర్లు పెట్టబోమని సీఎం కేసిఆర్  తెలిపారని అన్నారు. కృష్ణా,గోదావరి నదుల  పై  లక్షల కోట్లు ఖర్చు పెట్టి   సీఎం కేసిఆర్   ప్రాజేక్టులు నిర్మీస్తే  వాటి  పై పెత్తనం చెలాయించాలని  కేంద్ర ప్రభుత్వం చుస్తుందని అన్నారు.   ప్రస్తుతం  దేశంలో బొగ్గు ఉత్పత్తి తగ్గిందని,   కొన్ని ప్రదేశాలలో విద్యుత్ కోతలు ఉన్నాయని, అయినప్పటికి మన  రాష్ట్రంలో సీఎం కేసిఆర్  నాయకత్వంలో ఎలాంటి  కొతలు లేవని  తెలిపారు. అనంతరం రైతు భీమా చెక్కును మరియు ఇండ్లు పొందిన లబ్దిదారులకు నూతన వస్త్రాలను పంపిణీ చేసి వారితో సహపంక్తి భోజనాలు చేశారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి,  ఈఈపిఆర్, ఎం.ఆర్.ఓ., ఎంపీ.డి.ఓ., సర్పంచులు, ఎం.పి.పి.లు ఎంపిటి.సిలు, జెటీపీటీసీలు  సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గోన్నారు.

Previous articleదొంగల పట్ల అప్రమత్తం గా ఉండాలి నేర చరిత్ర గల వారికీ రౌడీ షీటర్ల కు హెచ్చరిక ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవు వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్
Next articleసర్వభూపాల వాహ‌నంపై శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్ప

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here