కడప
గురువారం నాడు కడప టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కడప అసెంబ్లీ టీడీపీ ఇంచార్జ్
వి.ఎస్.అమీర్ బాబు మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వైసీపీకి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదు. రాష్ట్రంలో వైసీపీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి. ప్రతిపక్ష నేతలపై, టిడిపి కార్యాలయాలపై దాడులకు నిరసనగా నేడు చంద్రబాబు గారు చేపట్టిన ఉగ్రవాదంపై పోరు దీక్ష.. వైసీపీ చరమ గీతానికి నాంది అవుతుందని అన్నారు.
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని బుధవారం రాత్రి హైడ్రామా మధ్య పోలీసులు అరెస్టు చేశారు. తలుపులు పగులకొట్టి మరీ లోపలకు వెళ్లి భారీ బందోబస్తు మధ్య అరెస్టు చేయడం దుర్మార్గం. రాత్రి 9గంటల సమయంలో పోలీసులు పట్టాభి ఇంటి పరిసర ప్రాంతాలను పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ అటు పు రాకుండా ఆంక్షలను కఠినం చేసి, రహదారికి రెండు వైపులా రోజా పార్టీలు సిద్ధం చేసి, పోలీసు వాహనాలను ఒక క్రమంలో పెట్టుకొని, పట్టాభి ఇంటివద్ద ఉన్న మీడియాను అర కిలోమీటరు దూరానికి పంపించివేసి, ఆ తర్వాత గేటు దాటుకుని లోపలకు వెళ్లి ఇంటి తలుపులను పగులగొట్టి, బలంగా ఉన్న గడియలను విరగొట్టి చకాచకా లోపలకు ప్రవేశించి.. పట్టాభిని అరెస్టు చేస్తు న్నట్టు వెల్లడించడం సమంజసమా అని అడిగారు.
సీఎం జగన్ పై పరుష పదజాలం ఉపయోగించినందుకు పట్టాభిపై క్రైం నం.352/2021తో ఐపీసీ 158(ఎం), 505(2), 353, 504 రెడ్ విత్ 120(బి) సెక్షన్ల కింద గవర్నరుపేట పీఎస్ లో కేసు నమోదు చేయడం అంటే ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా…? తెదేపా జాతీయ అధికార ప్రతినిధి శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరాం గారి ఇంటిపై దాడి చేయడమే కాకుండా తలుపులు పగలగొట్టి మరి అరెస్టు8 చేయడం దారుణం… పట్టాభి గారేమైన మీ లాగా ఆర్థిక నేరస్థుడా..? లేక ఉగ్రవాదా అని ప్రశ్నించారు.
ఆయనకు ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి, డీజీపీదే బాధ్యత. తక్షణం పట్టాభిని కోర్టు ముందు హాజరుపర్చాలి. బోడీకే అనేది రాజద్రోహం అయితే…. వెసీపీ నేతల అసభ్య బాష ఏ ద్రోహమని నిలదీశారు. ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తామంటే పోలీసులకు కోవిడ్ నిబంధనలు గుర్తుకు వస్తాయా…? అధికార పార్టీ వాళ్ళు ఊరేగింపులు, నిరసనలు, ధర్నాలు చేస్తే రావా..? అధికారం శాస్వితంగా కాదని పోలీసులు గురుంచుకొని తమ విధులు నిర్వర్తించాలని అన్నారు. ఈ సమావేశంలో కడప నగర అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి జలతోటి జయకుమార్, కడప పార్లమెంట్ ఉపాధ్యక్షుడు నక్కల శివరాం, కడప పార్లమెంట్ కార్యదర్శి మాసా కోదండరామ్, వరప్రసాద్, మైనార్టీ నాయకుడు నసీర్ అలీ, జింకా శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Home ఆంధ్రప్రదేశ్ ఏపీ లో ప్రజాస్వామ్యంకి కొత్త భాష్యం చెబుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వం… *వి.ఎస్.అమీర్ బాబు, కడప...