న్యూ ఢిల్లీ నవంబర్ 15
వాళ్లు ఏం చెబితే అంత. అది ఏ పని అయినా సరే.. మహిళలే కనిపిస్తారు. అక్కడ మహిళలదే పైచేయి. ఎందుకు అలా మహిళలే అక్కడ రాజ్యమేలుతున్నారు. మరి.. మగవాళ్లు ఏం పనిచేస్తారు.. అనే విషయాలు తెలియాలంటే.. ఓసారి ఐలాండ్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిందే.యూరప్‌లోని ఎస్టోనియాలో దాదాపు 2000 ఐలాండ్స్ ఉన్నాయి. అందులో ఒక ఐలాండ్ పేరు కిన్హు ఐలాండ్. దీని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది. ఈ ఐలాండ్ అందాలకు నెలవు. బీచ్, కొండలు, చెట్లు.. చుట్టూ ప్రకృతి అందాలే. ఇది టూరిస్ట్ ప్లేస్ కూడా.అయితే.. ఇక్కడ మహిళల జనాభా ఎక్కువే.. వాళ్లు చేసే పనులు కూడా ఎక్కువే. ఐలాండ్‌లో ఎక్కడ చూసినా మహిళలే కనిపిస్తారు. మగవాళ్లు చాలా తక్కువగా కనిపిస్తారు. దానికి కారణం.. ఐలాండ్‌లోని మగవాళ్లు అందరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లడం. అక్కడ పురుషులు.. రోజు వారి పనులు చేయరు. నెలలకు నెలలు.. సముద్రంలోనే ఉంటారు. చేపలను వేటాడుతారు. దీంతో ఐలాండ్‌లో మహిళలే ఉండాల్సిన పరిస్థితి. దీంతో అన్ని పనులు వాళ్లే చక్కదిద్దుతారు అన్నమాట.ఐలాండ్‌లో జరిగే పెళ్లిళ్ల దగ్గర నుంచి మనిషి చనిపోతే చేసే అంత్యక్రియల వరకు అన్నీ మహిళలే చూసుకుంటారు. డ్యాన్స్, పాటలు పాడటం, చేతి వృత్తుల పని, బిజినెస్, టూరిస్ట్ గైడ్.. ఇలా ప్రతి పని మహిళలే చేస్తారు. మగవాళ్లు అస్సలు ఈ పనులు చేయరు. మహిళలు కూడా పురుషులతో సమానమే. అన్నింట్లోనూ వాళ్లకు కూడా పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాలి. మహిళల సాధికారత కోసం కృషి చేయాలి.. అంటూ చాలా ప్రభుత్వాలు చెబుతుంటాయి. అలాగే అవకాశాలు కూడా కల్పిస్తుంటాయి.