హైదరాబాద్
లోయర్ ట్యాంక్ బండ్ లోని పింగళి వెంకట్ రామ్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన మాజీ హోమ్ శాఖ మంత్రి స్వర్గీయ నాయిని నరసింహ రెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు.వారి కుటుంబ సభ్యులను కలిసి వారికి మనోధైర్యం చెప్పారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.దివంగత నాయిని నర్సింహారెడ్డి కార్మిక పక్షపాతి,గొప్ప నాయకుడని కొనియాడారు.ఆయన భౌతికంగా దూరమై ఏడాది గడుస్తున్నా.ఆయన జ్ఞాపకాలు ఇంకా పదిలంగా ఉన్నాయన్నారు.ఉద్యమ ప్రారంభం నుంచి మా తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గారికి సన్నిహితులని,ఆయన ఏ విషయం అయినా దాచుకోకుండా మొఖం మీద మాట్లాడే ముక్కుసూటి మనిషని ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
Home తెలంగాణ దివంగత నాయిని నర్సింహారెడ్డి కార్మిక పక్షపాతి,గొప్ప నాయకుడు ఆయన భౌతికంగా దూరమై ఏడాది గడుస్తున్నా.....