Home తెలంగాణ జర్నలిస్టుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు ...

జర్నలిస్టుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు వినతి

108
0

ములుగు,సెప్టెంబర్ 20
తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులు న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని జర్నలిస్టు డేను పురస్కరించుకుని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా ఇంచార్జ్ మధుసూదన్, కన్వీనర్ సామ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ కృష్ణ ఆదిత్య  వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదనీ, సీఎం కేసీఆర్  ఇచ్చిన హామీలు అమలు కాలేదనీ, ముఖ్యంగా జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళు, కాళిస్థలాలి వ్వాలని చాలా రోజులుగా అడుగుతున్నా ఇంతవరకు ఏది ఇవ్వలేదన్నారు. చాలామంది జర్నలిస్టులు సొంత ఇళ్ళు లేక కిరాయి ఇళ్ళల్లో ఉంటూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారనీ అన్నారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా వున్న  మా డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళు లేదా ఇళ్ళపైలాభివ్వాలనీ విలేఖరిగా పని చేస్తున్న ప్రతీ ఒక్కరికీ అక్రెడిటేషన్ కార్డు ఇవ్వాలనీ, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలనీ, జర్నలిస్టు తీన్మార్ మల్లన్న పై పోలీసుల వేధింపులు ఆపాలన్నారు.
జర్నలిస్టులపై దాడుల నిరోధానికి జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలనీ, కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలనీ,కరోనాతో మృతి చెందిన కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలనీ, కరోనా పాజిటివ్ వున్న జర్నలిస్టులకు వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించాలన్నారు. జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలనీ, ఇచ్చిన హెల్త్ కార్డులు అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
చిన్న పత్రికలు,కేటుల్ టీవీలు, వెబ్ చానళ్ళను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాలనీ, రాష్ట్రస్థాయి మీడియా కమీషన్ ఏర్పాటు చేయాలనీ, జర్నరెస్టులు క్షణకు ప్రత్యేక చట్టం చేయాలన్నారు.
మీడియా అకాడమీకి బడ్జెట్ పెంచాలనీ, సమాచార శాఖకు పూర్తి స్థాయి కమిషనర్ నియమించాలనీ,
పత్రికా కార్యాలయాల్లో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలనీ, జర్నలిస్టులకు వెజ్ బోర్డ్ అమలు చేయాలనీ మా న్యాయమైన డిమాండ్ లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు జంగిలి కోటేశ్వరరావు, సుంకరి సంపత్ రావు, కిరణ్, సామ మల్లారెడ్డి, బోయినపల్లి శ్రీధర్ రావు,ఎండి షఫీ అహ్మద్, మాట్ల సంపత్, బద్రి, రమేష్,,పి శివ తేజ, వేణు, పి వాసు, బానోత్ వెంకన్న, కే మహేందర్ గౌడ్,గౌస్ పాషా, తిరుమల్, సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు ఎండి అమ్జద్ పాషా, గుండెబోయిన రవి గౌడ్,కోర్ర రాజు, ముంజల బిక్షపతి, కుమ్మరి సాగర్, కలువల రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

Previous articleప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా ఎదగాలి… ఆధ్యాత్మిక 10 వేల కరపత్రాలు విడుదల
Next articleటిఆర్ఎస్ పథకాలను ప్రజల్లో విరివిగా తీసుకోవాలి క్యాడర్ కు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here