నిర్మల్,
బుధవారం జిల్లా కల్లెక్టర్ కార్యాలయం లో వాల్మికి జయంతి సందర్బంగా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో నిర్వహించిన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖి మహర్షి వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రసిద్ధ రామాయణ మహాకావ్యాన్ని రచించిన శ్రీ వాల్మీకి మహర్షి కుటుంబ పోషణ కోసం దొంగ తనాలు, దారి దోపిడిలు చేసేవాడని అన్నారు. నారద మహర్షి హితోపదేశం వల్ల రామాయణ మహా కావ్యాన్ని రాసి మహర్షి అయినాడన్నారు రామాయణ మహా కావ్యాన్ని మొట్టమొదట సంస్కృతి బాష లో రచించి ఆది కవిగా పేరు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ లు హేమంత్ బోర్ఖరే, రాంబాబు లు, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, సహాయ బి.సి సంక్షేమ శాఖ అధికారి సుజయ్, పరిపాలనధికారి, కాలి క్ అహ్మద్, టి.ఎన్.జీ.వో. అధ్యక్షులు ప్రభాకర్, బిసి సంక్షేమ శాఖ సిబ్బంది, కలెక్టర్ కార్యాలయం సిబ్బంది, వాల్మికి సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Home తెలంగాణ ప్రసిద్ధ రామాయణం రాసిన వాల్మికి మహర్షి జీవితం ఆదర్శప్రాయ జిల్లా కలెక్టర్ ముషరాఫ్ ఫారూకి