భద్రాద్రి
పాల్వంచ పట్టణంలోని లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి సోమవారం మృతి చెందాడు. పట్టణంలోని భద్రాద్రి బ్యాంక్ పై నున్న హోటల్ కృష్ణ లాడ్జ్ లో సోమవారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటం లాడ్జ్ సిబ్బంది గమనించారు. దీనిపై వారు పోలీసులకు పిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.