Home తెలంగాణ అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

105
0

జగిత్యాల సెప్టెంబర్ 23
జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ లో గల సులబ్ కాంప్లెక్స్ లో గురువారం ఉదయం సుమారు 9.30 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఇతనికి మృతికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. మృతిని ఆచూకి కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సులబ్ కాంప్లెక్స్ మరుగుదొడ్డిలో పూర్తిగా కాలిపోయి మృత దేహం ఉండడంతో ఈ సంఘటన జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది.

సమాచారం ఇవ్వాలి: జగిత్యాల టౌన్ పోలిస్

మృతుడి కి చెందిన సమాచారం ఏవరికైనా తెలిస్తే జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో అందించాలని జగిత్యాల సిఐ కోరే కిషోర్ సూచించారు. మృతుడి వయసు సుమారు 35 ఏండ్ల నుంచి 40 ఏండ్ల లోపుగా ఉంటుందని, మృతదేహం జగిత్యాల జిల్లా ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరచడం జరిగిందన్నారు. తెలిసిన వారు జగిత్యాల పట్టణ సీఐ కోరే కిషోర్, 94407 95136 నంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

Previous articleమెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ రిలీజ్ చేసిన రాజ్ తరుణ్, శ్రీను గవిరెడ్డి, అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్‌వీసి ఎల్ఎల్‌పి ‘అనుభవించు రాజా’ టీజర్
Next articleపంజాబ్లో తప్పిన భారీ ఉగ్రదాడి.. ముగ్గురు అరెస్ట్‌ అమృత్‌సర్ సెప్టెంబర్ 23

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here