పత్తికొండ
మారుమూల గ్రామమైన కోతిరాలలో కొన్నేళ్ల నుంచి శాంతియుత వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు హాయిగా జీవనం సాగిస్తున్నారు. ఏ కష్టాలు వచ్చినా ఎలాంటి సమస్యలు నెలకొన్నా ఒకరికొకరు మాట్లాడుకుని పరిష్కరించుకుంటూ సంతోషంగా జీవనం గడిపారు. ఇలాంటి గ్రామంలో అతి దారుణంగా ఒక వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు నరికేశారు. కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని కోతిరాళ్ల గ్రామంలో సోమవారం ఉదయం నరికేశారు. ఉదయాన్నే పొలం పనుల పై వెళ్లిన గుమ్మరాళ్ల గొల్ల మల్లికార్జునను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికేశారు. గుర్తుతెలియని వ్యక్తులు తమకు తోచినట్లు రక్తం పారేలా నరకడం వల్ల గొల్ల మల్లికార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు భార్య గొల్ల సరోజమ్మ ,ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈయనకు ఉన్న 10 ఎకరాల పొలంలో వివిధ పంటల తో సాగు చేస్తున్నాడు. ఇద్దరు కుమారులు జీవనం కోసం ఇతర ప్రాంతాల్లో ప్రైవేటు ఉద్యోగాలు కొనసాగిస్తున్నారు. హత్యకు గురైన వివరాలను పూర్తిగా తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న కోతి రాళ్ల గ్రామ సర్పంచ్ ఆంజనేయ్యా అక్కడ పరిస్థితి చూసి చలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని అన్ని రకాలుగా, అనేక కోణాల్లో కేసును చేదించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.