చిత్తూరు
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల రైల్వే బ్రిడ్జి కింద నీటి ప్రవాహంలోఒక వ్యక్తి కొట్టుకుపోయిన సంఘటన చోటు చేసుకుంది. విషయాన్ని అటుగా వెళ్తున్న స్థానికులు పాకాల పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్ లకు సమాచారం అందించడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కొంత సమయానికి నీటి ప్రవాహంలో కొట్టుకు పోయిన వ్యక్తిని తాడు ల సహాయంతో బయటకు తీశారు.అప్పటికే ఆవ్యక్తి మృతి చెందినట్లుగా గుర్తించారు. ఏ.ఎస్.ఓ విశ్వనాధం,ఫైర్ సిబ్బంది,పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో తాడుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. మృతి చెందిన వ్యక్తి పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీ పచ్చిపాల పల్లికి చెందిన చిట్టిబాబు(55) గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాకాల ఎస్.ఐ వంశీధర్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో పాకాల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రమేష్ రెడ్డి, రవి, ఫైర్ సిబ్బంది గుణశేఖర్ రెడ్డి, విశ్వనాధం, చిట్టిబాబు, గిరిబాబు, పళణి, మాధవ, హేమకుమార్ తదితరులు పాల్గొన్నారు.