బెల్లంపల్లి అక్టోబర్ 07
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గతంలో జరిగిన ఒక సమావేశంలో అఖిలపక్ష నాయకుల పై చేసిన నిరాధారమైన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని గురువారం అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానిక బాపుక్యాంపు ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు రేగుంట చంద్రశేఖర్, గెల్లీ జయరామ్, గుండా మాణిక్యం,కాశీ సతీష్, ఎండీ. గౌస్, అమానుల్లా ఖాన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎల్ అఖిలపక్ష నాయకుల పై చేసిన ఆరోపణలను నిరూపించి నట్లయితే కాంటా బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ముక్కు నేలకేసి రాస్తామని అన్నారు. ఎడల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ముట్టడిస్తామని సవాల్ విసిరారు.టిఆర్ ఎస్ నాయకులు. అభివృద్ధి పేరుతో పట్టణంలో ప్రభుత్వ,సింగరేణి భూములను ఆక్రమిస్తూ కబ్జాలకు పాల్పడుతూన్నారని అన్నారు. పట్టణ ప్రజలకు కనీస త్రాగు నీటిని అందించలేకపోతున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాలని ఒకవైపు హైకోర్టు మొట్టి కాయలు వేసిన భూముల కబ్జాలు జరుగుతున్నాయని , జేఏసీ నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అనడం విడ్డూరమని అన్నారు . పట్టణంలో యథేచ్ఛగా భూములు కబ్జాలు చేస్తున్నారు, ప్రభుత్వ భూములు కాపాడుకోవడానికి అఖిలపక్షం నాయకులు ఎప్పుడు ముందుంటారు అని అన్నారు.సమావేశంలో అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు…