Home వార్తలు నవంబర్ 26న ‘1997’ సినిమా విడుదల

నవంబర్ 26న ‘1997’ సినిమా విడుదల

96
0

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం 1997. రియల్ ఇన్సిడెంట్స్‌ ను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన భిన్నమైన చిత్రం ఇది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, మూడు ప్రధాన పాత్రల్లో నటించిన మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ లుక్స్ విడుదలైన విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఏమి బతుకు.. ఏమి బతుకు’కు మంచి స్పందన లభించింది. మంగ్లీ పాడిన ఈ సాంగ్ అద్భుతంగా ఉందని మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ సినిమా నవంబర్ 26వ తేదీన విడుదల అవుతున్నట్టు రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఈ సినిమాలో నటించడంతో పాటు సంగీతం అందిస్తుండటం విశేషం. ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
నటీనటులు : డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి, బెనర్జీ, రవి ప్రకాష్, రామ రాజు తదితరులు…

Previous articleఎల్‌కే అద్వానీ 94వ పుట్టిన రోజు వేడుకలు హాజరైన ప్ర‌ధాని మోదీ, వెంక‌య్య‌నాయుడు, రాజ్‌నాథ్ సింగ్‌, అమిత్ షాలు..
Next articleదేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here