నల్గొండ సెప్టెంబర్ 24
నల్గొండ మండలం, ముషంపల్లిలో అత్యాచారం,హత్యకు గురైన ధనలక్ష్మి కుటుంబాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే.అరుణ పరామర్శించారు. ఈ సందర్బంగా ఘటనను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆమె మాట్లాడుతూ ముషంపల్లి లో జరిగిన ఘటన అమానుష ఘటన అని,ఈ ఘటనకు పాల్పడిన వాళ్ళను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వీలైనంత తొందరగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు.ఇటువంటి ఘటనలు జరగడానికి ప్రభుత్వమే కారణం..అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది..మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో నే ఆసరా పింఛన్, రైతుబంద్ ఇచ్చే దౌర్భాగ్య స్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేసారు.గ్రామాలలో బెల్టుషాపులు ఎక్కువడంతో ప్రభుత్వం ఇచ్చే పింఛన్ల డబ్బులు మొత్తం బెల్ట్ షాపుకే వెళ్తున్నాయన్నారు.దీనిని బట్టి చూస్తే ప్రభుత్వం కుడి చేతితో ఇచి ఎడమ చేతితో తీసుకుంటూ దోపిడీకి పాల్పదితున్దన్నారు.ధనలక్ష్మి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసారు.నిందితునికి త్వరగా శిక్ష పడేలా బిజెపి తరపున గవర్నర్ ను డిజిపి ని కలువ నున్నట్లు తెలిపారు.