అమరావతి
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శుక్రవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ తో కలిసి భేటీ అయ్యారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సమీర్ శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. పదవీ విరమణ చేసిన ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.