అమెరికా ఫస్ట్ … భరత్ సెకండ్
వాషింగ్టన్ అక్టోబర్ 18
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలా దేశాల్లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతున్నది. ఇప్పటివరకు ప్రపంచ దేశాల్లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23.75 కోట్లకు చేరింది. అటు కరోనా మరణాల సంఖ్య 48.40 లక్షలు దాటి 50 లక్షలకు చేరువ అయ్యింది. ఆదివారం ఉదయం జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఈ వివరాలను వెల్లడించింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 644 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపింది.ఇక అగ్రరాజ్యం అమెరికా కరోనా మహమ్మారికి తీవ్రంగా ప్రభావితమైంది. అక్కడ మొత్తం 4,43,17,553 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా మరణాలు కూడా అమెరికాలో భారీగానే నమోదయ్యాయి. మొత్తం 7,12,972 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా తర్వాత 3,39,35,309 కేసులతో భారత్ రెండో స్థానంలో ఉన్నది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా బ్రెజిల్ (2.15 కోట్లకుపైగా), బ్రిటన్ (81.58 లక్షలకుపైగా), రష్యా (76.31 లక్షలకుపైగా), టర్కీ (74.16 లక్షలకుపైగా) దేశాలు ఉన్నాయి.