బెల్లంపల్లి అక్టోబర్21
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లో యశ్వంతిక అనే యువతి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబీకులు యశ్వంతిక మృతి చెంది నాలుగు రోజులు గడుస్తున్నా నిందితుడు ఇప్పటి వరకు దొరకక పోవడంతో దళితులకు సరైన న్యాయం దొరకదు అని కుటుంబీకులు ఆగ్రహం చెంది బుధవారం సాయంత్రం మార్కెట్ కాంటా చౌరస్తాలో ధర్నాకు దిగారు వారి వెంట అంబేద్కర్ యువజన సంఘాలు దళిత సంఘాలు పాల్గొన్నారు సామాజిక కార్యకర్త మ్యాదరి రాజేష్ మాట్లాడుతూ నేడు దేశంలో ఎక్కడ చూసినా ఆడపిల్లలపై అకృత్యాలు,ఆగత్యాలు జరుగుతున్నాయి, ప్రభుత్వం, పోలీసులు ఎంతకఠినంగా వ్యవహరించిన ఎన్ని కఠిన శిక్షలు అమలుచేసిన నేరస్తులు సంఖ్య రోజురోజుకు పెరుగుతునే ఉన్నాయి ,ఎక్కడ చూసినా మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి నాలుగు రోజుల క్రితం జైపూర్ మండలం లో మృతి చెందిన యశ్వంతిక మృతికి కారకులైన వారిని అరెస్టు చేయాలని వారి తల్లిదండ్రులు వారి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్న ఇప్పటివరకు నిందితుని పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీనిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిందితులను త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని, యశ్వంతిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం,50లక్షల ఎక్స్ గ్రెసియా, ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని వారు కోరారు