Home తెలంగాణ పోలీసులు భయాందోళనలకు గురి చేస్తున్నారు శ్రీనివాస్ –...

పోలీసులు భయాందోళనలకు గురి చేస్తున్నారు శ్రీనివాస్ – శాంతి దంపతులు ,నాయకులు

115
0

బెల్లంపల్లి నవంబర్ 29
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన గిరిజన యువతి అన్యాయం జరిగిన విషయంపై పోరాడితే పోలీసులు భయాందోళనలకు గురి చేస్తున్నారని జంబి శ్రీనివాస్ – శాంతి దంపతులు ఆరోపించారు.  సోమవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్  బీజేపీ పార్టీ నాయకులతో విలేకరులతో మాట్లాడుతూ మైలారం గ్రామానికి చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని , దీంతో నెన్నెల ఎస్ఐ రమాకాంత్, రూరల్  సీఐ జగదీష్ లు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు . తమ ఇంట్లో మగవారు లేని సమయంలో పోలీసులు వచ్చి స్నానాల గదిలో స్నానం చేస్తున్న తన భార్యను బయటకు రావాలని ఇబ్బందులకు గురి చేశారని శ్రీనివాస్ పేర్కొన్నాడు . యువతికి జరిగిన అన్యాయంపై ఎస్సీ , ఎస్టీ కమీషన్ , మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు . ట్విట్టర్ ద్వారా జరిగిన అన్యాయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లడంతో పోలీసులు కక్ష సాధింపుతో అక్రమంగా కేసులు పెట్టారని వాపోయారు . అక్రమంగా పెట్టిన కేసులను కొట్టివేయాలన్నారు . సోదాల పేరుతో భయాందోళనలకు గురి చేసిన సీఐ . ఎస్ఎస్ఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు . ఈ సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్ . నాయకులు సురేష్ , రాచర్ల సంతోష్ , కళ్యాణి . శ్రీనివాస్ కుటుంబ సభ్యులు బాయక్క , రజిత తదితరులు పాల్గొన్నారు.

Previous articleయూనివర్సిటి గ్రౌండ్‌లో వాకింగ్ చేస్తే రూ.200లు యూజర్ చార్జీలను
Next articleపెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలి వ్యాట్ తగ్గించాలని కోరుతూ బీజేపి నేతలు వినూత్న రీతిలో నిరసన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here