చిత్తూరు
ఈనెల 23న హత్యకు గురైన వివాహిత శాంతి(32) కేసును పోలీసులు చేధించారు. చిత్తూరు జిల్లా నాగలాపురం ద్వారకా నగర్ లోఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. నిందితులు శాంతి భర్త సురేష్ (37) , అత్త లక్ష్మీ , సురేష్ స్నేహిఉతులరాజశేఖర్(29) , సుకుమార్ ( 22) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భార్య శాంతి వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం , అదనపు కట్నం తేలేదనే కారణంతో సురేష్ ఆమెను అంతమొందించాడు. దీనికి అతని స్నేహితులు రాజశేఖర్ , సుకుమార్, తల్లి లక్ష్మీ సహకరించారు. హత్యకు ఉపయోగించిన మచ్చుకత్తి , నోకియా బేసిక్ ఫోన్ , హీరోహోండా బైక్ ను నిందితుల వద్ధ నుండి స్వాధీనం చేసుకున్నారు.