రావులపాలెం
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గోదావరి బ్రిడ్జి మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన మహిళను రావులపాలెం హైవే మొబైల్ పోలీసు సిబ్బంది రక్షించారు. సోమవారం నాడు ఏరుబండి చక్రవేణి, (33) ను మహిళ , అత్తవారి ఊరు వెంకట్ నగర్ రాజమండ్రి ,అమ్మగారి ఊరు కానవరం గ్రామం రాజనగరం మండలం. ఆమెకు ఒక పాప, ఒక బాబు సంతానం. నాలుగు సంవత్సరాల క్రితం ఈమె భర్త చనిపోవడంతో పిల్లల పోషణ, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతోంది. ఈ నేపధ్యంలో కారణంగా గోదావరి బ్రిడ్జి మీద సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆదే సమయంలో అటుగా వెళుతున్న రావులపాలెం హైవే మొబైల్ సిబ్బంది ఆమెను గమనించి త్వరితగతిన ఆమె వద్దకు చేరుకుని రక్షించారు. తరువాత ఆమెను రావులపాలెం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు.