అనంతపురం జిల్లాలో విషాదం నెలకొంది. శింగనమల మండలంలోని శ్రీ గంపమల్లయ్య స్వామి కొండపై నంచి జారిపడి పూజారి మృతి చెందాడు. కొండ మీద నుంచి గుహలోకి దిగుతూ కాలు జారీమృతి చెందిన పూజారి అప్పా పాపయ్య. పెద్ద బండ మీద నుంచి గుహలోకి వెళ్లి పూజలు చేయడం ఆనవాయితీ. స్వామికి పూజ చేసి గుహలోకి దిగుతుండగా పుజారి కాలు జారింది. కొండ మీద నుంచి పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనను చూసిన భక్తులు ఆర్తనాదాలు చేసారు. పూజారి మృతదేహం మీద పడి భక్తులు బోరున విలపించారు. పాపయ్య గత నలభై సంవత్సరాలుగా గంపమల్లయ స్వామి కి పూజారిగా పనిచేస్తున్నారు శ్రావణమాసంలో గంపమల్లయ స్వామి కి విశేషంగా పూజలు జరుగుతాయి అదేవిధంగా ఈరోజు పూజలు చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అప్ప పాపయ్య జారిపడి వందల అడుగుల కింద పడి తల పగిలి మరణించాడు దీంతో ఒక్కసారిగా అక్కడ విషాదం నెలకొంది. గంపమల్లయ స్వామి భక్తుడైన తీవ్రంగా మృతి చెందడం భక్తులను కలచివేసింది