జగిత్యాల సెప్టెంబర్ 30
పెన్షనర్ల సమస్యలు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా,డివిజన్, మండలాల పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసి పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఎమ్మెల్యే కు తమ సమస్యలు విన్నవించారు. పీఆర్సీ బకాయిలు ఒకే దఫాలో సత్వరం చెల్లించాలని,పెన్షన్ ప్రతి నెల మొదటి తేదీన చెల్లించాలని,కరువు భత్యం చెల్లింపులో జాప్యం జరుగుతోందని,2018 తరువాత రిటైర్డ్ అయిన ఉద్యోగుల కు,ఉపాధ్యాయులకు పెరిగిన గ్రాట్యుటీ,లీవ్ ఎన్క్యాష్మెంట్,తదితర ప్రయోజనాలు సత్వరమే చెల్లించాలని,2018 తరువాత రిటైర్ అయిన వారి రివైజ్డ్ పెన్షన్ ఆర్డర్లు ఇంతవరకు రాలేదని,పెన్షనర్స్ వైద్యఖర్చుల బిల్లులు పెండింగులో ఉన్నాయని వెంటనే చెల్లింపులకు ఆర్ధిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.అంతే కాక జగిత్యాల జిల్లా కేంద్రంలో పెన్షనర్స్ కు,ఉద్యోగులకు,ఉపాధ్యాయులకు,జర్