కడప
కడప జిల్లా బద్వెల్ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి ఆధిక్యతను ప్రదర్శించింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెజార్టీ రికార్డ్ ను అదే జిల్లాకు చెందిన బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బ్రేక్ చేశారు.2019 ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసిన వైఎస్ జగన్.. టీడీపీ అభ్యర్థి సింగా సతీష్ కుమార్ రెడ్డిపై 90,110 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. కడప జిల్లాలోనే కాదు.. రాష్ట్రం మొత్తమ్మీద జగన్‌దే భారీ మెజార్టీ. 2019 ఎన్నికల్లో ఇదో రికార్డ్. అయితే ఆ రికార్డ్ ను బద్వేల్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా బ్రేక్ చేసేశారు. 90,550 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలుపొందారు.ఇప్పటి వరకూ రాష్ట్ర మొత్తమ్మీద ఉన్న ఈ రికార్డ్‌ను బ్రేక్ చేసేయడంతో వైసీపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడంతో బాగా వైసీపీకి కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు.