కామారెడ్డి అక్టోబర్ 12
: న్యాయవ్యవస్థలో న్యాయవాదుల పాత్ర కీలకమని, కామారెడ్డి జిల్లా జడ్జి రమేష్ బాబు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కోర్టు లోని బార్ అసోసియేషన్ హాలులో బదిలీపై వెళ్తున్న ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి రాజ్కుమార్ వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అదనపు జిల్లా జడ్జి రమేష్ బాబు మాట్లాడుతూ, న్యాయమూర్తులు జూనియర్ న్యాయవాదులకు, అండగా నిలవాల్సిన అవసరముందన్నారు. ప్రతి న్యాయమూర్తికి బదిలీ సర్వసాధారణమని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ పని చేసినా న్యాయవాదుల సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి లో ఐదు సంవత్సరాల పాటు జడ్జిగా పనిచేసి రాజ్ కుమార్ పలువురి మన్ననలను పొందారని ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి మాట్లాడుతూ జడ్జి రాజ్ కుమార్ జీవితంలో కామారెడ్డి మరువలేనిదని తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ తరపున బదిలీపై వెళ్తున్న రాజ్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, మొబైల్ వెంకటేష్ ధ్రువ, సీనియర్ న్యాయవాదులు, రామచంద్ర రెడ్డి, జగన్నాథం, వెంకట్రాంరెడ్డి,రమేష్ చంద్, శ్యామ్ గోపాల్ రావు, పి పి లు నంద రమేష్, నిమ్మ దామోదర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, దేవరాజ్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, అతి మాముల శ్రీధర్, జోల గంగాధర్, చింతల గోపి, లతా రెడ్డి అమీనా బేగం సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.