నంద్యాల
నంద్యాల పట్టణంలో గురువారం నాడు
నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు వై.యస్.ఆర్ ఆసరా రెండో విడత సంబరాలను మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. .
ఈ సందర్భంగా శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ 2014 ఎలక్షన్ ల సమయంలో చంద్రబాబు నాయుడు పొదుపు మహిళలకు రుణమాఫీ చేస్తానని అబద్ధపు మాటలు చెప్పి మభ్యపెట్టడం జరిగిందని అన్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అక్కాచెల్లెళ్లకు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తూ రెండో విడత ను నేడు విడుదల చేయడం జరిగిందన్నారు. నియోజగవర్గ ప్రజల తరపున యమ్ యల్ ఏ శిల్ప రవి చంద్ర రెడ్డి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ పి పి నాగిరెడ్డి. ఏపీ దృశ్య కళల డైరెక్టర్ సునీతఅమృతరాజ్. మరియు బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్. మరియు మున్సిపల్ చైర్మన్ మా బున్నిసా, మున్సిపల్ వైస్ చైర్మన్ లు గంగి శెట్టి శ్రీధర్, పామ్ శావళి, వై ఎస్ ఆర్ సి పి కౌన్సిలర్స్ కో ఆప్షన్ సభ్యులు వై ఎస్ ఆర్ సి పి ఇన్చార్జిలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.