Home తెలంగాణ మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి తీన్ ఖని వద్ద స్మారక...

మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి తీన్ ఖని వద్ద స్మారక స్తూపం ఏర్పాటు చేయాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూత్ అధ్యక్షుడు ముజాహీద్

91
0

జగిత్యాల , నవంబర్ 11
స్వాతంత్ర్య సమర యోధుడు,
భారతరత్న, భారత దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూత్ అధ్యక్షుడు ముజాహీద్ ఆలియాస్ (ఆదిల్ )అన్నారు.  గురువారం జగిత్యాల పట్టణంలోని తీన్ ఖని వద్ద మౌలానా అబుల్ కలాం ఆజాద్ 133 వ జయంతి ఉత్సవాలను మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మైనారిటీ నాయకులు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూత్ అధ్యక్షుడు ముజాహీద్ ఆదిల్ మాట్లాడుతూ స్వాతంత్య పోరాటంలో ఆజాద్ త్యాగాలు వెలకట్టాలేనవన్నారు. ప్రముఖ విద్యావేత్త అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ దూరదృష్టితో విద్యావ్యవస్థను
దేశంలో పటిష్టం చేశారన్నారు. తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేసిన గొప్ప నాయకులు అని, మౌలానా అబుల్ కలాం ఆజాద్ అడుగుజాడల్లో నడస్తూ ఆయన సేవలను స్మరించుకోవాలన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాలలో స్వాత్రంత్య సమర యోధుల విగ్రహాలు ఏర్పాటు చేశారని, దేశ స్వాత్రంత్య పోరాటంలో తన జీవితాన్ని ధార పోసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్మారక చిహ్నంను ఏర్పాటు చేయడంలో మాత్రం ఎందుకు అలసత్వం వహిస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను ఎన్నో సార్లు విన్నవించిన మౌలానా స్మారక స్థూపాన్ని నిర్మించాలని పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్మారక స్థూపాన్ని నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహమ్మద్ అజహార్, ముఖస్సర్ అలీ నేహాల్, అబ్దుల్ రహీమ్, ముజీబ్ ఉద్దీన్, మోయిజ్ ఉద్దీన్ , అస్గర్ షా, ఖాలీద్ ఖాన్,డా.అయ్యుబ్ ఖాన్,  కమల్, అస్గర్ మహమ్మద్ ఖాన్, మసి ఉద్దీన్, నహిద్, ఆరిఫ్ ఖాన్, నేహాల్, అత్తర్ ఖాన్, రియాజ్, కైసార్, సలాం, మేరాజ్, జాకీర్, ఆమేర్ , యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Previous articleమంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవ బాధిత వ్యక్తికి రూ. 4 లక్షల ఎల్ వో సి అందజేత
Next articleకేంద్రమంత్రి పియూష్ గోయల్ తో మంత్రి మేకపాటి భేటీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here