జగిత్యాల అక్టోబర్ 22
కన్నోళ్లు పట్టించుకోకున్నా, ఎవరు లేక అనాధలుగా మారిన వృద్ధులను చేరదీసి ఇంటోళ్లను మరిపించే రీతిలో శివ గాయత్రి వృద్ధాశ్రమ నిర్వాకులు అందిస్తున్న సేవలు అభిననందనీయమని
అల్ ఘలియా వినాయక గ్రూప్ వారు అన్నారు.గురువారం వాల్మీకి జయంతిని పురస్కరించుకుని స్థానిక గుట్ట రాజేశ్వర స్వామి సన్నిధి సమీపంలోని శివ గాయత్రి అనాధ వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న వారికి రూ.20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.అనంతరం శ్రీ గాయత్రి విశ్వకర్మ అనాధ వృద్ధుల ఆశ్రమం కు 20000,
శ్రీ వాల్మీకి ఆవాసం సేవా భారతి గ్రామీణ నిరుపేద విద్యార్థుల వసతి గృహం లో కూడా 10000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవన యాత్రలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని చివరి మజిలీ లో సంతోషకరమైన జీవితాన్ని అనుభవించాల్సిన వృద్ధులు ఇక్కడికి రావడమే బాధాకరమన్నారు. అయినా ఆ పైవాడి దయతో ఇంటిని మరిపించే రీతిలో ఇక్కడి ఆశ్రమ నిర్వాకులు వృద్దులకు అందిస్తున్న సేవలు అభినందనీయమైనవని వారు అన్నారు.