ఏలూరు
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో పేరుపాలెం సౌత్ గ్రామంలో ఆస్తి కోసం కన్న తండ్రిని చంపిన కసాయి కొడుకు.వివరాల్లోకి వెళితే మృతుడు ఉల్లంపర్తి పెద్దిరాజు కు పది మంది కూతుళ్లు ఒక కొడుకు సంతానం అందరికీ వివాహాలు అయిపోయాయిఇతనికి సుమారు మూడు ఎకరాల పొలం ఉంది కొడుకు అల్లరిచిల్లరిగా తిరుగుతున్నాడని అతని పేర అష్టి రాస్తే నాశనం చేస్తాడని ఉద్దేశంతో తన తదనంతరం కొడుకు ఉల్లంపర్తి మారయ్య(లాజర్)కు చెందేలా ఆస్తి రాశాడు అప్పటినుండి తన పేర ఆస్తి రాయాలని తన తోబుట్టువలను, తండ్రి పై పలు సార్లు దాడి చేశాడు ఇతని పై కేసు ఉన్నట్టు సమాచారం.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారు లోవున్న నిందితుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.