Home తెలంగాణ ప్రత్యేక వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి జిల్లా కలెక్టర్ జి....

ప్రత్యేక వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి జిల్లా కలెక్టర్ జి. రవి

116
0

జగిత్యాల, అక్టోబర్ 20
జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితా ఆధారంగా నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమంలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్, మెగా పల్లె ప్రకృతి వనాలు, మల్టిలేవల్ ఎవెన్యూ ప్లానిటేషన్, ఇతర ప్రగతి పనుల పురోగతి మరియు నిర్వహణపై స్థానిక సంస్థల అధనపు కలెక్టర్, ఆర్డీఓలు  మరియు ప్రత్యేక అధికారులతో జూమ్ వెబ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.  బతుకమ్మ, దసరా పండుగలు అనంతరం పాఠశాలల పునఃప్రారంభం కానున్న తరుణంలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమంను మరింత వేగవంతం చేయాలని, పండుగల సందర్భంగా జిల్లాలో ఆశించిన మేర మున్సిపల్, గ్రామ స్థాయిలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ జరగడం లేదని అన్నారు.  ఓటరు జాబితా ఆదారంగా చివరి వ్యక్తి వరకు వ్యాక్సినేషన్ అందేలా క్షేత్రస్థాయిలో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులు ప్రత్యేక దృష్టితో కృషిచేసి,  నిర్దేశించిన మేర లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు.
బాలింతలు, కొన్ని కమ్యూనిటి మతాల పరంగా వ్యాక్సిన్ పై విముకత చూపే వారికి వ్యాక్సిన్ పై వైద్యాధికారులతో అవగాహన కల్పించాలని  ఆదేశించారు.  పోలం పనులకు  వెళ్లెవారి కొరకు సిబ్బంది త్వరగా వారివద్దకు చేరుకోవడం గాని లేదా వారు పనిచేసే చోటుకు గాని వెళ్లి వ్యాక్సిన్ అందించడం లేదా సాయంత్రం ఎక్కువ సమయం అక్కడే ఉండి వారికి వ్యాక్సిన్ అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఇంటింటి సర్వే నిర్వహించి ప్రతిఇంటికి స్టిక్కరింగ్ వేయాలని పేర్కోన్నారు.  సెంటర్ వారిగా వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రతిరోజు సమీక్షించడం జరుగుతుందని తెలియజేశాయ. పంచాయితి సెక్రటరి, విఆర్ఏ, ఇతర గ్రామస్థాయి అధికారులను ఈ ప్రక్రియలో అవసరమైతే వాడుకోని, జిల్లాలో ప్రతి పిహెచ్సి సెంటర్, సబ్ సెంటర్ వారిగా వందశాతం లక్ష్యాన్ని సాధించి జిల్లాను ముందుజలో నిలపాలని అధికారులను ఆదేశించారు. మల్టిలేవల్ ప్లానిటేషన్ నిర్వహణ సక్రమంగా జరగడం లేదని, కోన్ని ప్రాంతాలలో మొక్కలు సరిగా లేకపోవడం, ట్రిగార్డులు లేకపోవడం వంటివి గుర్తించడం జరిగిందని, మొక్కలు లేని చోట ఇతర మొక్కలను నాటి సక్రమంగా ట్రిగార్డులను ఏర్పాటు చేయాలని సూచించారు.  అసంపూర్తిగా ఉన్న వైకుంటదామాల నిర్మాణాలను పూర్తిచేయాలని, వాటికి సంబంధించిన బిల్లులు ను అప్ లోడ్ చేయాలని, డంపింగ్ యార్డ్ పనులు పూర్తిచేయాలని, బృహత్ పల్లె ప్రకృతి వనాలకు దాదాపుగా స్థలాలను కేటాయించి,పెద్ద ఎత్తున మొక్కలు నాటే పనులు పూర్తిచేయడం జరుగుతుందని, కోన్ని చోట్ల స్థలాల గుర్తింపులో ఇబ్బందులు తలెత్తినట్లయితే వాటిపై చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులను అదేశించడం జరిగిందని పేర్కోన్నారు.

Previous articleరూ. 4 కోట్లు పట్టివేత
Next articleజిల్లా పోలీస్ కార్యాలయంలో మహర్షి వాల్మీకీ జయంతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here