చిత్తూరు, మా ప్రతినిధి, సెప్టెంబర్ 21
నవరత్నాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఈ నిర్మాణాలను వేగవంతం చేయాలని ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడమే ఉద్యోగుల ప్రథమ కర్తవ్యం గా భావించాలని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ అన్నారు. జిల్లా లో జరుగుతున్న మంగళవారం నాడు జిల్లా లో జరుగుతున్న గృహ నిర్మాణాల పై కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ నందు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1,74,240 ఇల్లు మంజూరు కావడం జరిగిందని,మెగా గ్రౌండింగ్ సందర్భంగా 1,01,220 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించడం జరిగిందని, ఇప్పటి వరకు 6,961 నిర్మాణాలు రూఫ్ లెవెల్ లో ఉన్నాయని, ఈ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, అదే విధంగా జిల్లా లో ఇప్పటి వరకు రూ. 174.81 కోట్లు ఖర్చు చేశారని, నిర్మాణాలను వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మండలాల వారీగా గృహ నిర్మాణాలకు సంబంధించి సమీక్ష ను నిర్వహించారు. సత్యవేడు, శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాలలో గృహ నిర్మాణాల విషయం లో అధికారులు అలసత్వం వహిస్తున్నారని, పీలేరు, పలమనేరు, మదనపల్లె నియోజకవర్గాలలో నిర్మాణాలు వేగవంతం గా జరుగుతోందని, గృహ నిర్మాణాలను వేగవంతం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సచివాలయాల ద్వారా పలువురు ఉద్యోగులు రావడం జరిగిందని, గృహ నిర్మాణ కోసం గ్రామ సచివాలయాలలో ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్లను కూడా ఉపయోగించుకోవడం జరుగుతోందని వారి సేవలతో పాటు ఇంజినీరింగ్ అధికారులు కృషి చేసి ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలని అన్నారు. కొన్ని నియోజకవర్గాలలో నిర్మాణాలు వేగవంతం గా జరగడం లేదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా కల్పించడం జరిగిందని, లబ్ధిదారులకు బ్యాంక్ లోన్ లేదా మహిళా సంఘాల నుండి లోన్ తీసుకునే విధంగా సహకరించి నిర్మాణాలు వేగవంతంగా చేయాలని ఈ సందర్భంగా బేస్ మెంట్ లెవెల్ స్థాయి పెంచిన ఇంజినీరింగ్ అధికారులను అభినందించిన కలెక్టర్ లక్ష్యాలను ఛేదించడం లో విఫలమైన వారిని వేగవంతంగా పనులు చేయించాలని అన్నారు. ఈ సందర్భంగా రూ. 78 కోట్ల మేర ఋణ సౌకర్యం మహిళా సంఘాల ద్వారా కల్పించడం జరిగిందని, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి వివిధ రకాల వస్తువులను బహిరంగ మార్కెట్ లో ధరలను నియంత్రణ లో ఉంచే విధంగా ఇతర అధికారులతో సహకరించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమం లో కలెక్టర్ తో పాటు జె సి (హౌసింగ్) వేంకటేశ్వర, ట్రైనీ కలెక్టర్ అభిషేక్ కుమార్, హౌసింగ్ పి డి పద్మనాభం, జిల్లా లోని హౌసింగ్ శాఖకు చెందిన ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Home ఆంధ్రప్రదేశ్ పేదలందరికీ ఇల్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయం తో ఉంది ఇళ్ల నిర్మాణాలను వేగవంతం...