న్యూ ఢిల్లీ నవంబర్ 11
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం, సీపీఐ నాయకులు చేస్తున్న పోరాటం అభినందనీయమని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సంఖ్యాబలం లేకున్న అద్భుతంగా పోరాడుతున్నారని ఆయన ప్రశంసించారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నిషేధిస్తామని పాదయాత్రలో పేర్కొన్న సీఎం జగన్ ప్రస్తుతం దానిపై ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు.మద్యనిషేధం అమలు చేయకపోతే ఓట్లు అడగనని జగన్ హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. మాట తప్పినందున వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలను ఓట్లరు అడుగుతారా.. లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎయిడెడ్ పాఠశాలలను విలీనం చేయడాన్ని రఘురామకృష్ణరాజు తప్పుబట్టారు.