జగిత్యాల,నవంబర్ 18
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన భాధ్యత ప్రతి ఒకరిపై ఉందని బతికేపల్లి సర్పంచ్ తాటిపర్తి శొభారాణి ప్రజలకు సూచించారు.గురువారం ప్రపంచ టాయిలెట్స్ డే సందర్బంగా గ్రామంలోని ఒకరి బాత్ రూమ్ డోర్ చెడిపొగా సర్పంచ్ శొభారాణి స్పందించి డోర్ రిపేర్ చేయించి తిరిగి అమర్చడంతో స్థానికులు సర్పంచ్ ను అభినందించారు.
ఈ సంధర్బంగా సర్పంచ్ శొభారాణి మాట్లాడుతూ ఇంటి చుట్టూ,ఇండ్లల్లో చెత్తను పారవెయకుండ బుట్టల్లో వేసి గ్రామ పంచాయితీ సిబ్బందికి అందజేయాలని సూచించారు.
నీటి కుండీల్లో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు.
నాటిన చెట్లకు నిరుపోసి కాపడాలని, పరిసరాలు శుభ్రంగా ఉంటే రోగాలు ధరిచెరవని పేర్కొంటూ గ్రామ పంచాయితీ సైతం మురుగు కాలువలను శుభ్రం చేయడమే కాకుండా రోడ్లను శుభ్రం చేస్తున్నామని శొభారాణి చెప్పారూ. ఉన్నత,ప్రాథమిక
పాటశాలలను శుభ్రం చేశారు.
కార్యక్రమంలో వార్డ్ సభ్యులు చంద్ర శేఖర్ గౌడ్, మహేశ్,ప్రధాన ఉపాధ్యాయులు రాజశేఖర్,జబినా హసియా,ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.