హైదరాబాద్ అక్టోబర్ 25
టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తున్నాయి అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.అనేక అవమానాలు ఎదుర్కొని, రాజీలేని పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామని, మన పథకాలను ఇతర రాష్ట్రాలు మాత్రమే కాకుండా, కేంద్రం కూడా కాపీ కొడుతుందని కేసీఆర్ అన్నారు. ప్లీనరీ వేదికలో ఆశీనులైన టీఆర్ఎస్ ప్రజాప్రతినిదులకు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. 20 సంవత్సరాల ప్రస్థానం తర్వాత మళ్లీ ఒకసారి అద్యక్ష బాధ్యతలు చేపట్టివల్సిందిగా, ఏగక్రీమవంగా నన్ను ఎన్నుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2001, ఏప్రిల్ 27 స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశ్రయం జలదృశ్యం ఆవరణలో ఈ గులాబీ పతాకాన్ని ఆవిష్కరించాము. ఆనాడు విపరీతమైన అపనమ్మక స్థితి. గమ్యం మీద స్పష్టత లేనటువంటి అగమ్య గోచర పరిస్థితి. ఉద్యమం మీద అప్పటికే ఆవరించుకున్న అనుమానాలు, అపోహాలు, దుష్ప్రచారాలు.. రకరకాల అనుమానాస్పదస్థితుల మధ్య గులాబీ జెండా ఎగిరింది.నాడు తెలంగాణ సమాజం విశ్వాసం లేనటువంటి స్థితిలో ఉంది. ఈ సమాజం ఆ స్థితి నుంచి బయటకు రావాలని మాట్లాడుకున్నాం. దేశ స్వాతంత్ర్య పోరాటం మహాత్మగాంధీ ఆధ్వర్యంలో సాగింది. స్వాతంత్ర్య సమరబాటలో 287 సార్లు అనేక ఉద్యమాలకు పిలుపునిచ్చి, వాటిని వాపస్ కూడా తీసుకున్నారు. 1857లో సిపాయిల తిరుగుబాటు విఫలమైంది. జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగింది. అయినా స్వాతంత్ర్య పోరాటం ఆగలేదు. విజయం సాధించింది. ఆ పంథాలోనే తెలంగాణ ఉద్యమం సాగింది. స్పష్టమైనటువంటి మార్గాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగడం జరిగింది. మీలో చాలా మంది మొదటి రోజు నుంచి నేటి వరకు పని చేస్తూనే ఉన్నారు.సిపాయిల తిరుగుబాటు విఫలమైంది అని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్ర్యం.. రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది.. ముమ్మాటికీ తెలంగాణ వచ్చి తీరుతుందిని అని నిర్ణయించుకున్నాం. అలా అనేక రకాలుగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాము. సమైక్యవాదులు అనేక అడ్డంకులు సృష్టించారు. చేయని ప్రయత్నం లేదు. వేయని నిందలు లేవు. పెట్టని తిప్పలు లేవు. ఎన్ని జేయాల్నో అన్ని చేశారు. చివరికి రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యే ముందు కూడా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారు. మనం కూడా అంతే పట్టుదలతో ఎప్పటికప్పుడు వివ్లేషించుకుంటూ ముందుకు సాగినం కాబట్టి విజయతీరాలకు చేరి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ ఉద్యమం ప్రపంచ ఉద్యమాలకు కొత్త బాటను చూపాయి. చరిత్రలో తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు శాశ్వతంగా కీర్తి ఉండిపోతుంది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దళిత బంధు ప్రకటించాక ఆంధ్ర నుంచి వేల విజ్ఞాపనలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో మీ పార్టీ పెట్టండి గెలిపించుకుంటామని చెబుతున్నారు. తెలంగాణ పథకాలు తమకు కావాలని ఆంధ్రా ప్రజలు కోరుతున్నారు. తెలంగాణలో మంచి పథకాలు అమలవుతున్నాయని, ఆ రాష్ట్రంలో మమ్మల్ని కూడా కలపాలని కోరుతూ నాందేడ్, రాయచూర్ జిల్లాల నుంచి డిమాండ్లు వచ్చాయి. ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో కూలీలు వచ్చి పని చేస్తున్నారు. దేశ, విదేశాల్లో రాష్ట్ర ప్రతిష్ఠ ఇనుమడిస్తోందన్నారు.కేసులతో అభివృద్ధిని అడ్డుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. సాహసం లేకుండా ఏ కార్యం సాధ్యం కాదు. కలలు కని.. ఆ కలలనే శ్వాసిస్తే సాకారమవుతాయి. తెలంగాణలో అద్భుతంగా వ్యవసాయ స్థీరీకరణ జరిగింది. మనం విడిపోయిన ఏపీ తలసరి ఆదాయం రూ. 1.70 లక్షలే. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2.35 లక్షలకు పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంట్ సమస్యలు వస్తాయని కొందరు ఏపీ నేతలు అపోహలు సృష్టించారు. కానీ తెలంగాణలో 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఆంధ్రాలో 24 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అన్ని రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం సఫలీకృతమవుతందని సీఎం కేసీఆర్ అన్నారు.ప్లీనరీకి ముందు వేదికపై ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరుల స్థూపానికి కేసీఆర్ నివాళులర్పించారు. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ జెండాను సీఎం ఆవిష్కరించారు. వేదికపై ఆశీనులైన సీఎం కేసీఆర్‌కు హోంమంత్రి మహముద్ అలీ దట్టీ కట్టారు. టీఆర్ఎస్ నాయకులతో హైటెక్స్ నిండిపోయింది.