అమరావతి నవంబర్ 17
రాష్ట్రంలో జరిగిన 12 మున్సిపాల్టీలు, ఒక కార్పారేషన్‌కు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కేవలం రెండు మున్సిపాల్టీలను దక్కించుకుని కనీస గౌరవాన్ని దక్కించుకుంది. మిగత 11 చోట్ల అధికార వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో కార్పొరేషన్, మరో 10 మున్సిపాల్టీలపై ఫ్యాన్ జెండా ఎగురనుంది. దర్శి మున్సిపాల్టీలో టీడీపీ విజయం సాధించింది. మొత్తం 20 వార్డుల్లో 13 స్థానాలను టీడీపీ అభ్యర్థులు దక్కించుకోగా అధికార వైఎస్సార్‌సీపీ7 స్థానాల్లో గెలుపొందింది.కృష్ణా జిల్లాలోని కొండపల్లి పురపాలిక ఎన్నిక హోరాహోరీగా సాగింది. మొత్తం 29 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ 14, టీడీపీ 14 వార్డుల్లో అభ్యర్థులు విజయం సాధించారు. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి (టీడీపీరెబల్) గెలుపొందారు. అయితే గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి శ్రీలక్ష్మి.. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరారు. ఫలితంగా కొండపల్లిలో సైకిల్ పార్టీ బలం 15కి చేరింది.