Home తెలంగాణ ఒమిక్రాన్‌తో పొంచి ఉన్న ముప్పు కలెక్టర్‌ గౌతమ్‌

ఒమిక్రాన్‌తో పొంచి ఉన్న ముప్పు కలెక్టర్‌ గౌతమ్‌

107
0

ఖమ్మం  నవంబర్ 02
ఒమిక్రాన్‌తో మనకూ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు.
కలెక్టరేట్‌లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ నిరోధక టీకా రెండు డోసులు అర్హులంతా తీసుకోవాలని, టీకా తీసుకుం వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుందన్నారు. జిల్లాలో మొదటి డోస్‌ 95 శాతం మందికి, రెండు డోసులు 51.90 శాతం మందికి అందించామని చెప్పారు. రెండోడోసు టీకా తీసుకునేందుకు సమయం పూర్తయినవారు 63,568 మంది ఉన్నారని, వారంతా వెంటనే టీకా తీసుకోవాలని సూచించారు. కరోనా నిరోధానికి ప్రతి వ్యక్తి కచ్చితంగా మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్‌ తప్పనిసరి అన్నారు. మాస్క్‌ ధరించని వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సమీపంలోని రెవెన్యూ, పోలీస్‌, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చేవారు కచ్చితంగా ఐసోలేషన్‌లో ఉండాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 4 నుంచి 5 వేల కరోనా పరీక్షలు చేస్తున్నామని, వీటిని మరింత పెంచుతున్నట్లు తెలిపారు. విదేశాల నుంచి వచ్చేవారి వివరాలు తెలిపేందుకు ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, ప్రజలంతా స్వీయ రక్షణ చర్యలు పాటించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ రక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో వింజం అప్పారావు, డీఎంహెచ్‌వో మాలతి పాల్గొన్నారు.

Previous articleఒమిక్రాన్ వేరియంట్ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాలి త‌ప్ప‌నిస‌రిగా అందరు మాస్కు ధ‌రించాలి ధ‌రించ‌క‌పోతే రూ. 1,000 జ‌రిమానా రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు
Next articleస‌స్పెన్ష‌న్ ఎత్తివేయాల‌ని విప‌క్షాల ఆందోళ‌న

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here