Home ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల అవకాశాల సద్వినియోగానికే వాణిజ్య ఉత్సవం

ఎగుమతుల అవకాశాల సద్వినియోగానికే వాణిజ్య ఉత్సవం

144
0

తిరుపతి, మా ప్రతినిధి,సెప్టెంబర్ 25
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయముతో  వాణిజ్య  ఉత్పత్తులు ఎగుమతి కోసం  జిల్లాలోని  పారిశ్రామిక ఔత్సాహికులు ముందుకు రావాలని  జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్  ఇ. ప్రతాప్  రెడ్డి  అన్నారు.  శనివారం ఉదయం రేణిగుంట  ఎలక్ట్రానిక్   మానుఫాక్చర్ క్లస్టర్ – 2  వద్ద ఎ. పి. ఐ. ఐ. సి.  ఓ. డబ్ల్యు. ఎస్.  బిల్లింగ్ లో  “ వాణిజ్య ఉత్సవం “ కార్యక్రమం జిల్లా  పరిశ్రమల శాఖ, ఎ పి ఐ ఐ సి   సమన్వయము తో ఒక  రోజు అవగాహన సదస్సు  నిర్వహించారు.
జి. ఎం., డి.ఐ.సి.   మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా  ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న సమయంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయముతో  జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పారిశ్రామిక  వేత్తలు  తమ ఉత్పత్తులను  ఎగుమతి చేసుకోవడానికి అవగాహన కల్పించాలని ఈ  సదస్సు ఏర్పాటు  చేశామని తెలిపారు. స్టాంప్ డ్యూటీ రీయంబర్స్ మెంట్, సబ్సిడీ, యూనిట్ల ఏర్పాటుకు గల అవకాలు, విద్యుత్ సబ్సిడీ, వంటివి పరిశ్రమలు సద్వినియోగం చేసుకోవాలని, జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో వున్న  ఎగుమతులు, వాటి  అవకాశాలు వంటివి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సదస్సులో  ఎ పి ఐ ఐ సి  పారిశ్రామిక  వేత్తలకు  కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు కావలసిన  భూమి వివరాలు తమ వెబ్ సైట్ లో  పొందుపరచామని   సద్వినియోగం  చేసుకోవాలని  ఎస్ . సువన సోని వివరించారు.
కస్టమ్స్  మరియు సెంట్రల్  ఎక్సైజ్  సూపరింటెండెంట్  లతీఫ్  ఎగుమతుల పాలసీ విధానం, జి  ఎస్ టి  డిప్యుటీ  అసిస్టెంట్  కమీషనర్  చెన్నా రెడ్డి  ఎగుమతులపై టాక్స్  విదానం   వంటివి వివరించగా, యూనియన్  బ్యాంకు రీజనల్  హెడ్ పి డి వి శర్మ , లీడ్ బ్యాంక్  మేనేజర్ శేషగిరి రావు ,  వ్యాపార వేత్తలు  ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకర్ల సహకారం పొందాలని సూచించారు.
వాణిజ్య ఉత్సవంలో జిల్లాకు చెందిన  వి. ఆ.ర్ వి.  ఏషియా  పసిఫిక్,  కాంటినెంటల్  కాపీ, జెన్ లినెన్ , వేర్ మెరియన్ ఇండియా, రేహాబ్ , పుట్టా శ్రీ లెదర్స్, గియాన్ ఫార్మా, రాక్ వర్త్ ఫర్నిచర్,  సువేరా ఫుడ్స్,  ఆర్. ఎస్. ఫోటో.  కోటింగ్,  ఆర్. వి. ఆర్.  గ్రానైట్స్ , రాజారాం ఇండస్ట్రీస్, ఎ. కె. ఆర్. టెక్స్ టైల్స్,  టెర్రకోట బొమ్మలు,  కలంకారీ వస్తువులు,  బాలాజీ వుడ్ కార్వింగ్ కోయ బొమ్మలు,  ఉత్పత్తుల ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేశారు.
ఈ వాణిజ్య ఉత్సవం లో జిల్లాకు చెందిన పలు  పారిశ్రామిక వేత్తలు,  కళాశాలల విద్యార్థులు, అధికారులు పెద్ద  ఎత్తున  పాల్గొన్నారు.

Previous articleనూత‌న జెఈవోగా వి.వీరబ్రహ్మయ్య బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌
Next articleకాలాన్ని బట్టి రైతులు పంట మార్పిడి చేయాలి జడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here