విశాఖపట్నం
అరకులోయ మండల కేంద్రం లో నూతనంగా నిర్మించిన కాయకూరల గిరిజన మార్కెట్ యార్డ్ కేటాయింపుల్లో పారదర్శకంగా అర్హులైన వారికి కేటాయించాలి
సిఐటియు జిల్లా కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు మండల కార్యదర్శి పి బాలాదేవ్ మాట్లాడుతూ ప్రజలు ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించిన గిరిజన మార్కెట్ యార్డ్ తే 30 ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా రోడ్లమీద కాయకూరల వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులకు పారదర్శకంగా కేటాయించాలని ఎటువంటి అవినీతి చోటు చేసుకోకుండా ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలని కాయగూరలు వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరికి మార్కెట్ సౌకర్యం కల్పించాలని సిఐటియు డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో కాయకూరల వ్యాపార సంఘం నాయకులు మంజుల, శ్రీను, నాయుడు, శాంతి తదితరులు పాల్గొన్నారు