పెద్దపల్లి నవంబర్ 19
అపదలో ఉన్న వారికి అపన్న హస్తం అందించడానికి నైతిక బాధ్యతగా ముందుకు సాగాలని రామగుండం నగర పాలక మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం జ్యోతి గాంధీ పౌండేషన్ అధ్వర్యంలో పలు స్వచ్చంధ సంఘాల నిర్వహణలో నిరు పేద కుటుంబాలకు చెందిన వృద్ద మహిళలను చీరలు, కొంత నగదు పంపిణి కార్యక్రమం లక్ష్మినగర్ లో జరిగింది. ఈ సందర్బంగా సామాజిక కార్యక్రమాలను ఈ ప్రాంత సమాజానికి అందిస్తున్న పౌండేషన్ బాధ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రామగుండం లయన్స్ క్లబ్ మగువ సెక్రటరీ డాక్టర్ లక్ష్మి వాణి, జ్యొతి గాంధీ పౌండేషన్ అద్యక్షురాలు అశ్రీత వందన్, అక్షయ పాత్ర కార్యనిర్వాకులు ముద్దసాని సంధ్యా రెడ్డి, ఆర్తీ స్వచ్చంధ సంఘం అధ్యక్షుడు విజయ చంద్ర శేఖర్, జయహొ మహిళా సేవా సంఘం అధ్యక్షురాలు శ్రీలత, సిరి స్వచ్చంధ సంఘం కార్యనిర్వహకులు చిప్ప రజిత, సహరా సేవా సంఘం బాధ్యులు చింతి రెడ్డి సంతొష రెడ్డి, తెలంగాణా మహిళ మిత్ర అధ్యక్షురాలు గొలివాడ చంద్ర కళ, నీడ స్వచ్చంధ సంఘం అధ్యక్షుడు పల్లెర్ల రమేష్ గౌడ్, పలు పక్షాల బాధ్యులు దయానంద్ గాంధీ, బైరీ మానస, రవి కిరణ్, గడ్డం రాజు, చాతబొయిన శ్రీనివాస్, ముల్కల ప్రసాద్, వరుణ్య, వరుణ్ సాయి తదితరులు ఉన్నారు.