నెల్లూరు
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల రీత్యా, కాలుష్యం నివారణ రీత్యా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని డి ఆర్ ఉత్తం హోటల్ నందు జరిగిన గ్యాబ్ గ్రీన్ అలైన్స్ బయోటెక్ బయోడిగ్రీడబుల్ అండ్ కంపోస్టబుల్ కవర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఈ బయోడిగ్రేడబుల్ కాంపోజిట్ కవర్స్ 30 రోజుల నుంచి 180 రోజులు భూమిలో కంప్లీట్ గా కరిగిపోయి ఎరువుగా మారుతాయన్నారు. ప్లాస్టిక్ నివారణకు ఇవి సరి అయిన ప్రత్యామ్నయంగా అభివర్ణించారు. ప్రతి ఒక్కరు వీటిని వాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర కమిషనర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ వంతుగా సహకరిస్తామన్నారు. ప్రజలు కూడా వారు ముందుగా సహకారం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, అమరావతి కృష్ణారెడ్డి, కుడుముల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Home ఆంధ్రప్రదేశ్ పరిసరాల పరిరక్షణ కై ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలి నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్