జగిత్యాల, సెప్టెంబర్ 17
గ్రామీణ మరియ పట్టణ ప్రాంతాల్లో నిర్ణిత లక్ష్యం మేరకు ప్రతీ రోజు ప్రతి సెంటర్ల లో 100 మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించేలా ప్రణాళికను రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ శిభిర కార్యాలయం నుండి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి రోజు 161 నివాసాలు, 41 వార్డులలో 15505 మందికి మొదటి డోసును, 3843 మందికి రెండవ డోసు వ్యాక్సిన్ లను అందించడం జరిగిందని, ఈ సందర్బంగా అధికారులకు, సిబ్బందికి అభినందనలను తెలియజేశారు. వ్యాక్సిన్ వాయిల్స్ , ఇంజక్సన్ లను మండల కేంద్రాలకు సకాలంలో సరిపడ పంపించాలని, ప్రత్యేక అధికారులు ఎటువంటి అలస్యం జరగకుండా చూడాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ప్రజల నుండి స్పందన తక్కువగా ఉందని, అర్బన్, రూరల్ ఎరియాలలో నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని, ప్రతిరోజు వ్యాక్సిన్
సంబంధించిన నివేధికలను తయారు చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాలకు సరిపోయోల సిరంజులను సరఫరాల చేయాలని పేర్కోన్నారు. డాటా ఎంట్రి ఆపరేటర్ కొరత వలన ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, డాటాఎంట్రి కొరకు ఒక్కరు, పేర్లు చదవడానికి ఒక్కరి చోప్పున ఇద్దరిని నియమించాలని సూచించారు. విధులకు గైర్హజరైన సిబ్బందికి మెమోలు జారీచేయాలని, ఇదే విధంగా మరోసారి కొనసాగించినట్లయితే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అవసరమైతే వ్యవసాయ పనులకు వెళ్లే వారి కొరకు ఉదయం త్వరగా ప్రారంభించాలని, సాయంత్రం వరకు ఎక్కువ సమయం ఉండేలా చూడాలని అన్నారు. వీధి వారిగా ప్రణాళికను తయారు చేసుకోవాలని, అందుకు తగ్గట్లుగా వ్యాక్సిన్ లను అందించాలని వైద్యాధికారులను అదేశించారు. ప్రతిరోజు 100 మందికి వ్యాక్సిన్ అందించేలా ప్రణాళికను సిద్దం చేసుకొవాలని అన్నారు. రూరల్, అర్బన్ లలో ఎక్కడ వ్యాక్సిన్ అందిస్తున్నారో అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమాచారాన్ని మందుగానే అందించాలని పేర్కోన్నారు.ఈ టేలికాన్ఫరెన్సులో
ఆదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఆరుణశ్రీ ,
జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్, డీపీఓ, మండల ప్రత్యేక అధికారులు , తదితరులు పాల్గొన్నారు.