కామారెడ్డి నవంబర్ 30
పెట్రోల్ , డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ ను తగ్గించాలని కామారెడ్డి బీజేపీ పట్టణ అధ్యక్షుడు విపుల్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ లు డిమాండ్ చేశారు.మంగళవారం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ ,డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేశారు
ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు విపుల్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ లు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం విదించే వ్యాట్ తగ్గించాలని, పెట్రోల్ డీజిల్ ధరల భారం వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయల తగ్గించిందని, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో టాప్ 3 లో తెలంగాణ ఉందని, ప్రతి విషయంలో బీజేపీ పాలిత రాష్టాలతో పోల్చుకొనే రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో కూడా పోల్చుకొని తగ్గించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ లో అధిక శాతం ప్రజలు పేద, మధ్య తరగతి వాళ్ళు ఉండటం వల్ల పెట్రోల్, డీజిల్ రేట్లు వారికి గుది బండగా మారాయని,
పెట్రోల్ పై 35 శాతం, డిజిల్ పై 22 శాతం వ్యాట్ విధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ వ్యాట్ ను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Home తెలంగాణ పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ తగ్గించాలి బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో...