జగిత్యాల అక్టోబర్ 27
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక
రాష్ట్రంలో ఆన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పని చేస్తున్నదని,ప్రజాసేవే పరమావధిగా భావిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆని
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్. సంజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం
జగిత్యాల మండల లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన దళిత యువకుడు నక్క హరీష్ గత వర్షాకాలం పిడుగుపాటుకు గురై మరణించగా ప్రభుత్వం ద్వారా మంజూరైన 6 లక్షల విలువగల ప్రొసీడింగ్ కాపీని హరీష్ తండ్రి లింగన్నను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అందరికి సంక్షేమ పథకాలు అందించాలనే దిశగానే కార్యక్రమాలు చేపడుతున్నారని,ఈరోజు లక్ష్మీపూర్ గ్రామంలో దళిత యువకుడు ప్రమాదవశాత్తు పిడుగుపాటుకు గురై చనిపోవడం వల్ల ఎదిగిన కొడుకుని లింగన్న కోల్పోవడం చాలా బాధాకరమని కొడుకుని తిరిగి తీసుకురాలేమని కానీ ప్రభుత్వం ద్వారా మంజూరైన 6 లక్షల ప్రొసీఈడింగ్ ఇవ్వడం వల్ల వారి కుటుంబానికి కొంత ఆర్థికంగా చేయూతగా ఉంటుందని,గతంలో దామోదర్ రెడ్డి అనే రైతు చనిపోతే 5 లక్షలు అందించామని,కరెంట్ షాక్,వర్షాలకు ఇల్లు దెబ్బతిన్న,పశువులు మరణించిన ఇలా అనేక విధాలుగా ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని ఉమ్మడి రాష్ట్రంలో ఈనాడు ఇవి ప్రజలకు అందలేదని అన్నారు. ముఖ్యమంత్రి ప్రజల శ్రేయస్సు,అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన చేస్తున్నారని,ప్రతి పక్షాలు అసత్య ప్రచారాలు నమ్మవద్దని,వారి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ పథకాలలో సంఘం కూడా మలు కాలేవని అన్నారు. ఎమ్మెల్సీ కవిత,మంత్రులు కేటీఆర్, ఈశ్వరన్న సహకారంతో జగిత్యాలను అభివృద్ధి చేసుకుందామని,ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉన్నానని ప్రజలు వినియోగించు కోవాలని అన్నారు.నాయకులకు,కార్యకర్తల సహకారం తోనే బీద,మద్య తరగతి ప్రజలకు సేవలను అందిస్తున్నామని ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు అని అన్నారు.దేశం మొత్తంలోనే తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా అమలుకావట్లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్రప్రసాద్,ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు,రైతు బంధు మండల కన్వీనర్ రవీందర్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ సందీప్ రావు,ఆత్మ చైర్మన్ రాజిరెడ్డి, సర్పంచ్ చెరుకు జాన్,ఎంపీటీసీ సునీత లక్ష్మణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు నగేష్ గౌడ్, విడిసి చైర్మన్ స్వామిరెడ్డి, గ్రామస్తులు సత్తి రెడ్డి,రవి,రాజీ రెడ్డి, రాజేష్, విజయ్, సర్పంచులు,ఎంపీటీసీలు,
ప్యాక్స్,ఏఎంసీ డైరెక్టర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.